ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం బహుశః ప్రజలు ఎన్నడూ ఇంత ఆతృతగా ఎదురుచూసి ఉండరేమో? ఈసీ ఆదేశం ప్రకారం ఈరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్ నివేదికలు ప్రకటించుకోవచ్చు. మీడియా కూడా ఆ నిమిషం కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్నట్లుంది. అప్పుడే అన్ని ప్రధాన మీడియా, సర్వే సంస్థలు తమ అంచనాలు ప్రకటించడానికి ఆయా పార్టీల ఎన్నికల గుర్తులు, కాలమ్స్ తో ఛార్టులు ప్రదర్శిస్తున్నాయి.
ఇంకా మరో 45 నిమిషాల సమయం ఉన్నప్పటికీ పీపుల్స్ సర్వే సంస్థ ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై తమ ఎగ్జిట్ పోలింగ్ గణాంకాలను సోషల్ మీడియాలో ప్రకటించేసింది. దాని ప్రకారం ఏపీ శాసనసభ ఎన్నికలలో టిడిపికి 95-110, జనసేనకు: 14-20, బీజేపీకి 2-5, వైసీపికి 45-60 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
ADVERTISEMENT
ADVERTISEMENT




