
ముంజేతి కంకణం చూసుకునేందుకు అద్దమెందుకన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి ఎవరో చెప్పాల్సిన అవసరమే లేదు.
Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?
ఆర్ధిక పరిస్థితి బాగుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ హామీలన్నీ టకటకా అమలుచేసి ఉండేది. బడ్జెట్ కేటాయింపులు ఘనంగానే ఉండేవి. లోటు తక్కువగానే ఉండేది కదా? కానీ ఇవన్నీ ఎందుకు జరగడం లేదు?అని ప్రశ్నించుకుంటే జగన్ చేసిన ఆర్ధిక విధ్వంసమే అని ఎవరైనా చెపుతారు కదా?
బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ పదేపదే గత ప్రభుత్వం, ఆర్ధిక విధ్వంసం, అప్పులు అనడంతో మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గనకి రోషం వచ్చింది. ‘అత్త తిట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నా’ అన్నట్లుంది ఆయన తీరు.
Also Read – జగన్ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ఈవిదంగా ఎందుకు ఉందో బుగ్గన కంటే ఎవరికి బాగా తెలుస్తుంది? కానీ బడ్జెట్‌లో తూతూ మంత్రంగా కేటాయింపులు జరిపారని, బడ్జెట్ కవర్ పేజ్ బాగుంది కానీ కంటెంట్ లేదంటూ విమర్శించారు.
ఎందుకంటే తమ హయాంలో చేసిన అప్పులకు ఇప్పుడు ఆయనకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు కనుక! ఒకానొక సమయంలో ఏపీ కూడా శ్రీలంకలా దివాళా తీస్తుందని అందరూ భయపడ్డారు కదా? ఎటు చూసినా అప్పులే తప్ప చేతిలో చిల్లి గవ్వ లేకుండా బుగ్గనామాత్యులు 5 ఏళ్ళు ఏవిదంగా మేనేజ్ చేశారో ఎవరూ ఊహించలేరు. అసలు ప్రభుత్వోద్యోగులకు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా వారితో 5 ఏళ్ళు ఎలా పనిచేయించుకున్నారో బుగ్గనామాత్యులకే తెలియాలి.
Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?
అందరికీ ‘మేలు’ చేస్తున్నామంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి చేతులు దులుపుకు పోయారు. వారి నిర్వాకం వల్లనే నేడు రాష్ట్రానికి అప్పు పుట్టే పరిస్థితి, అప్పు చేసే స్థోమత రెండూ లేకుండా పోయాయని మంత్రి పయ్యావుల కేశవ్ చెపితే సిగ్గుతో తలవంచుకోవాలి కానీ రోషం దేనికి?