sit-on-vivekas-murder-case

వివేకా హత్య కేసులో ఒకరొకరుగా సాక్షులు మరణిస్తుండటం, వారిలో కొందరి మరణాలు అనుమానస్పదంగా ఉండటంతో ఈ వరుస మరణాలపై విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం 16 మందితో సిట్ ఏర్పాటు చేసింది. దీనికి డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వం వహిస్తారు.

ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన వాచ్ మ్యాన్ రంగన్నతో కలిపి ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు సాక్షులు చనిపొయారు.

Also Read – జగన్‌ పొమ్మన్నారు బాబు రమ్మన్నారు.. అశోక్ లేలాండ్‌ని

2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణంగా హత్య చేయబడటం, ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు వగైరా వివరాలు అందరికీ తెలిసినవే.

ఆ కేసు విచారణని ఏపీ నుంచి తెలంగాణ (హైదరాబాద్‌)కు బదిలీ చేసినా ఏమాత్రం వేగవంతం కాలేదు. నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఈ కేసులో కదలికలు తీసుకు రావడానికి వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనబడటం లేదు.

Also Read – అప్పుడు డ్రగ్స్ కేసులు…ఇప్పుడు బెట్టింగ్ కేసులు..!

ఇప్పుడు వాచ్ మ్యాన్ రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం అవడంతో, ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం సహజమే.

కానీ ఇప్పుడు సిట్ రంగంలో దించితే ఈ కేసులో అసలు సీబీఐ ఉందా లేదా?సీబీఐ ఉంటే ముందుగా అది స్పందించాలి కదా? కానీ ఎందుకు స్పందించలేదు?అనే సందేహం కలుగుతుంది.

Also Read – రచ్చ గెలిచేసాడు.. మరి ఇంట..?

ఏపీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో విచారణలో మళ్ళీ కొత్త విషయాలు బయటపడే అవకాశం ఉండొచ్చు. ఉండకపోవచ్చు.

ఒకవేళ కొత్త విషయాలు బయటపడితే, వాటిపై అభ్యంతరాలు, అనుమానాలు తెలుపుతూ మళ్ళీ కొత్త పిటిషన్లు పడే అవకాశం ఉంటుంది. అంటే ఈ కేసు విచారణ మళ్ళీ మొదటికి వస్తుందన్న మాట! ఒకవేళ కొందని తవ్వి ఎలుకని పట్టుకోలేకపోతే సిట్ ఏర్పాటు వలన కూటమి ప్రభుత్వానికి అప్రదిష్టే కదా? అప్పుడు వైసీపీ కూడా వేలెత్తి విమర్శించకుండా ఉంటుందా?

కనుక సీబీఐ చొరవ తీసుకొని దర్యాప్తు జరపాల్సిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సిట్ ఏర్పాటు చేయడంతో అయోమయం నెలకొంది.

ఇప్పుడు ఎలాగూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక సీబీఐ విచారణ పూర్తిచేసేందుకు ఎటువంటి అవరోధాలు ఉండవు. కనుక సీబీఐ చేత ఈ కేసు విచారణని పూర్తిచేయించి దోషులకు శిక్షలు పడేలా చేయాల్సిన ప్రభుత్వం, మద్యలో జోక్యం చేసుకొని సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది?




రంగన్న మృతి కేసు కూడా సీబీఐకి అప్పగించేస్తే అదే చూసుకునేది కదా?కానీ కూటమి ప్రభుత్వం అనవసరంగా చేతికి మట్టి అంటించుకోవడం, ఆ తర్వాత ఏదైనా తేడా వస్తే ఇబ్బంది పడటం దేనికి? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.