వాయిదాల ఘట్టం ముగిసింది.!ఇక రిజర్వుల వంతు వచ్చింది.!

Chandrababu Naidu

చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టైన నాటి నుండి టీడీపీ చేస్తున్న న్యాయపోరాటాలకు ఆది అంతం లేకుండాపోయింది.ఎట్టకేలకు ఫలించిన టీడీపీ ప్రయత్నాలుతో బాబుకి తాత్కాలిక బెయిలు తీసుకురాగలిగారు. చంద్రబాబుకి సాధారణ బెయిలు కోసం టీడీపీ హైకోర్టు తలుపు తట్టిన విషయం అందరికి తెలిసిందే.

అయితే బాబు బెయిలు పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు వాదనలతో కొంత కాలం,వాయిదాలతో ఇంకొంత కాలం గడుపుతూ వచ్చింది. నిన్న విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు ఈ రోజు ఇరు పక్షాల వాదనలు విని తీర్పుని రిజర్వులో చేసింది. బాబు తరుపున లూద్రా, సిఐడి తరుపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

ADVERTISEMENT

వరల్డ్ కప్ ఫైనల్ ను తలపించేలా నువ్వా నేనా అన్నట్టు బాబు కి బెయిలు తీసుకురావడానికి టీడీపీ నేతలు, అలాగే ఎట్టి పరిస్థితులలో బాబుకి సాధారణ బెయిలు రాకుండా అడ్డుకోవడానికి వైసీపీ పార్టీ తమ శక్తియుక్తులు ప్రయోగిస్తున్నాయి. ఇక చివరిపోరులో నెగ్గేదెవరో, తగ్గేదెవరో కోర్ట్ తీర్పు వెలువడిన తరువాతనే తెలుస్తుంది. అప్పటివరకు టీడీపీ, వైసీపీ నేతలు “వాయిదాల ఘట్టం ముగిసింది.!ఇక రిజర్వుల వంతు వచ్చింది.”! అంటూ మీన మేషాలు లెకించాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories