నాడు పరిహసించిన న్యాయస్థానాలు, ప్రజాస్వామ్యమే నేడు దిక్కు!

AP High Court

జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తే న్యాయమూర్తులు, న్యాయవాదులను కూడా వేలెత్తిచూపుతూ విమర్శించడానికి వెనకాడలేదు.

ADVERTISEMENT

అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను వేధించి వేటాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేస్తూ పైశాచికానందం అనుభవించారు. టిడిపి నేతలు, కార్యకర్తలు, వారి కార్యాలయాలు, ఇళ్ళ దాడులు చేస్తూ పురాణ ఇతిహాసలలో మాత్రమే కనిపించే రాక్షస పాలన ఏవిదంగా ఉంటుందో జగన్‌, వైసీపి నేతలు ప్రజలకు, ప్రతిపక్షాలకు రుచి చూపారు.

కానీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆనాడు పరిహసించిన న్యాయస్థానాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగమే తమని కాపాడాలంటూ వైసీపి నేతలు పరుగులు తీస్తున్నారు.

రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన వైసీపి కార్యాలయాలను ఎందుకు కూల్చివేయరాదో వివరణ కోరుతూ ఆయా ప్రాంతాలలో పురపాలక సంఘాలు నోటీసులు పంపిస్తుండటంతో, వైసీపి నేతలు హైకోర్టుకి పరుగులు తీసి పిటిషన్లు వేశారు.

వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యధాతధ స్థితి కొనసాగించాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు.

అయినా కూడా వైసీపి నేతలు నేడు మరోసారి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేసి, అధికారులు కూల్చివేతలకు పూనుకోకుండా నియంత్రించేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

వీటి కోసం వైసీపి ఏకంగా 9 మంది సీనియర్ న్యాయవాదులను రంగంలో దింపిందంటే ఎంత ఆందోళన చెందుతోందో అర్ధం చేసుకోవచ్చు.

అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?అని ఆలోచిస్తే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను వేధించడం అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇష్టారాజ్యంగా వైసీపికి భూములు కేటాయించేసుకుని వాటిలో భవనాలు నిర్మించుకోవడమే అని అర్దమవుతూనే ఉంది.

ఆనాడు తాము ప్రత్యర్ధులపై దౌర్జన్యాలు చేస్తునప్పుడు, ఏదో ఓ రోజు వాటికి తాము కూడా మూల్యం చెల్లించక తప్పదని ఇంగితం లేకపోవడం వలననే అని చెప్పుకోవచ్చు. ఆ ఇంగితం ఎందుకు కొరవడింది అంటే తమ దౌర్జన్యాలకు ప్రతిపక్షాలు భయపడి రాజకీయాల నుంచి తప్పుకుంటాయని, కనుక ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనే గుడ్డి నమ్మకం లేదా భ్రమ వలన కావచ్చు.

కానీ జగన్‌ అనుకున్నది ఒకటి. జరిగింది మరొకటి. కనుక ఇప్పుడు తమని కాపాడేవారు ఎవరా అని చూస్తే మళ్ళీ అవే న్యాయస్థానాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగమే కనబడుతున్నాయి. కనుక ఇప్పుడు వైసీపికి ఆ మూడే దిక్కు.

కానీ అవినీతి, అక్రమాలు చేసి కాపాడమంటే అవి మాత్రం కాపాడుతాయా? కాపాడకపోతే వైసీపికి దిక్కు ఎవరు? వైసీపి పరిస్థితి ఏమిటి?

ADVERTISEMENT
Latest Stories