వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు జగన్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్న వైసీపీ నాయకుల ప్రచారంలో వాస్తవమెంత అనేది పోలింగ్ రోజు తేటతెల్లమయ్యింది.
పేదల బతుకు మార్చాలంటే వారి పిల్లలకు సరైన విద్య సదుపాయాలు అందించాలి అంటూ నాడు నేడు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాని అమలుకు కొన్ని వేల కోట్లు వెచ్చించారు జగన్. కోట్ల ప్రజాధనమైతే ఆవిరయ్యింది కానీ పనులు మాత్రం శూన్యంగా కనపడుతున్నాయి. అయితే వైసీపీ ప్రచారానికి అవసరమైన విధంగా జిల్లాకు ఒకటి రెండు స్కూల్స్ ను అభివృద్ధి చేసి రాష్ట్రమంతా ఇదే విధంగా ప్రభుత్వ బడులను తీర్చి దిద్దాం అంటూ తమ సొంత పత్రికలో ప్రచారం చేసుకుని సాక్షిని అభివృద్ధి చేశారే కానీ వాస్తవ రూపంలో నాడు నేడు ఎక్కడ కనిపించలేదు.
Also Read – మనోజ్ ‘మంచు’ ని కరిగిస్తారా.? కాపాడతారా.?
సాధారణంగా ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలనే ఎంచుకునే ఈసీ ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించింది. అయితే ఆ ప్రభుత్వ బడులలో ఓటేయడానికి వచ్చిన ఓటర్లకు నాడు నేడు తో బాగుపడిందెవరో స్పష్టంగా అర్ధమయ్యింది. ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు నాటికి నేటికీ ఒకే తీరుగా దర్శనమిచ్చాయి.
మరి ఇన్నాళ్లుగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాలన్నీ ప్రజలను మభ్యపెట్టే తియ్యటి అబద్దాలే అని తేలిపోయింది. కొన్ని కొన్ని స్కూల్స్ లో అయితే గోడలు పెచ్చులు పెచ్చులుగా రాలి పడుతున్నాయి. మరికొన్ని పాఠశాలలో పోలింగ్ కోసమని తాజాగా నిర్మించిన మరుగు దొడ్లు దర్శనమిచ్చాయి. కనీసం గోడలకు ప్లాస్టింగ్ కానీ, సున్నం కానీ లేని పాఠశాలలో ఎన్నో.
Also Read – మూగబోయిన టాలీవుడ్…!
పోలింగ్ కేంద్రాలుగా ఎంచుకోబడిన కొన్ని కొన్ని ప్రభుత్వ బడులలో తాగడానికి మంచి నీరు కూడా దొరకని పరిస్థితి. మరి నాడు – నేడు తో ఎం మారింది అంటే ప్రభుత్వ పథకాల ప్రచారాల పేరుతో నాటికీ నేటికీ సాక్షి ఆదాయం రెట్టింపు గా మారింది. అలాగే నాడు నేడు కార్యక్రమంతో స్థానిక వైసీపీ నాయకుల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యింది. పోలింగ్ డేతో నాడు నేడు తో వైసీపీ ప్రభుత్వ భ్రమలో నుంచి ప్రజలు బయటపడగలిగారు. నాడు నేడు తో ప్రజలకు జగన్ మీద ఉన్న నమ్మకం పోయింది.
జగన్ పథకాల్ని ప్రచారానికే తప్ప వాస్తవిక రూపంలో ఉండవనే వాస్తవానికి ప్రజలు రాగలిగారు. నాడు నేడు తో కానీ, ఇంగ్లీష్ మీడియం విద్యతో కానీ పేద విద్యార్థుల బతుకుల్లో ఎటువంటి మార్పు రాలేదని దీనికి ప్రతిగా ప్రభుత్వ మార్పు తప్పదనే సంకేతాలు పంపారు ఓటర్లు. జూన్ 4 తరువాత వైసీపీ పార్టీలో నాడు నేడు పథకం కింద విప్లవాత్మక మార్పు రానుంది అంటూ సర్వేలన్నీ ఢంకా భజాయిస్తున్నాయి. ఇప్పటికే ఈ నాడు నేడు పథకం వైసీపీ నాయకుల గొంతులో స్పష్టంగా కనపడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.