
దేశంలో తరచూ ఎందరో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామాలు చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు వస్తున్న స్పందనలు మరెవరికీ వచ్చి ఉండవు.
“నేను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానంటూ” ఆయన దేవుడి మీద ఒట్టు వేసి చెప్పినా ఎవరూ నమ్మడం లేదు.
Also Read – అందరికీ ఓ రెడ్‌బుక్ కావాలి.. తప్పు కాదా?
ఆయన కేసుల నుంచి ఉపశమనం కోసమే రాజీనామా చేశారని కాదుకాదు.. జగన్ పదేపదే అవమానిస్తుండటంతో అదును చూసి రాజీనామా చేసి దెబ్బకొట్టారని కొందరు… రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.
ఆయన జగన్‌కి ఆత్మ వంటివారు. జగన్ కోసం సూట్ కేసు కంపెనీలు సృష్టించి, ఆ కేసులలో జగన్ వెంట చంచల్‌గూడా జైలుకి కూడా వెళ్ళి వచ్చారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వారి పార్టీలని దుంప నాశనం చేసేందుకు ఆయన జగన్‌కి అన్నివిదాలుగా సలహాలు, సహాయసహకారాలు అందిస్తుండేవారు.
Also Read – కథ నచ్చితే ‘అమ్మ’ అయినా ‘అమ్మమ్మ’యినా ఒకే..
2019 ఎన్నికలలో జగన్ అనుకూల రాజకీయ శక్తుల, వర్గాల మద్దతు కూడగట్టి వైసీపీని గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత ఆక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు జగన్ మెడకు చుట్టుకోకుండా రాజ్యసభ సభ్యుడు హోదాలో ఢిల్లీలో పైరవీలు చేస్తూ అడ్డుకునేవారు.
ఇంతగా జగన్ కోసం చేసిన విజయసాయి రెడ్డి ఆయన విదేశంలో ఉన్నప్పుడు హటాత్తుగా రాజీనామా ప్రకటన చేయడం చాలా ఆలోచింపజేస్తుంది. వైసీపీలో రెండో స్థానంలో ఉన్న ఆయన తప్పుకోవడం అంటే జగన్ ఆత్మ, నీడ విడిచిపెట్టి వెళ్ళిపోయిన్నట్లే!
Also Read – రాహుల్ “లీగల్లీ కన్వెర్టడ్ ఇండియన్”.?
ఆయన జగన్ గురించి ఎంత మంచిగా మాట్లాడినా తన రాజీనామా వలన కూటమికి లబ్ధి (రాజ్యసభ సీటు) కలుగుతుందని చెప్పడం గమనిస్తే వైసీపీని, జగన్‌ని దెబ్బతీసేరని అర్దమవుతూనే ఉంది. కానీ ఎందుకు?
అంటే దానికీ ఓ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది. విశాఖ రాజధాని పేరుతో విజయసాయి రెడ్డి విశాఖలో సంపాదించిన అక్రమ, అవినీతి సొమ్ములో పూర్తిగా జగన్‌కి పంపించకుండా ఎక్కువ భాగం ఆయన అట్టేబెట్టుకొని కొద్దిగానే పంపిస్తున్నారని బొత్స, ఎంవీవీ వంటి ఉత్తరాంధ్ర నాయకులు జగన్‌కు పిర్యాదు చేసేవారని గుసగుసలు వినిపించేవి.
ఆస్తులలో వాటాలు అడుగుతున్నందుకే తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన జగన్, విజయసాయి రెడ్డిని ఉపేక్షిస్తారా? అంటే కానేకాదు. అప్పటి నుంచే జగన్ ఆయనని దూరంగా పెట్టడం మొదలుపెట్టారు.
దాంతో ఆయన ఢిల్లీకి మకాం మార్చి రాజ్యసభ సభ్యుడు హోదాలో ప్రధాని మోడీ, అమిత్ షా తదితరులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించేవారు. అది చూసి అప్రమత్తమైన జగన్, ఆయనని నెల్లూరు నుంచి లోక్‌సభకి పోటీ చేయాలని బలవంతం చేశారు.
లోక్‌సభ ఎన్నికలలో ఎలాగూ గెలవలేరని ఆయనకి, జగన్‌కి ఇద్దరికీ తెలుసు. అయితే మళ్ళీ తాను గెలిచి ముఖ్యమంత్రి అవుతానని గట్టిగా నమ్మిన జగన్, తర్వాత ఆయన చేత రాజ్యసభ సీటుకి రాజీనామా చేయించి మరో విధేయుడిని ఆ సీట్లో కూర్చోబెట్టి విజయసాయి రెడ్డికి కత్తెర వేయాలని జగన్ భావించి ఉండొచ్చు. జగన్‌కు ఇంత సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డికి ఆ ఆలోచనలు పసిగట్టలేరని అనుకోలేము.
ఇన్ని దశాబ్ధాలుగా వైఎస్ కుటుంబానికి, జగన్‌కి వీరవిధేయుడుగా సేవ చేసిన తననే జగన్ దెబ్బ తీయాలనుకున్నప్పుడు, తాను మాత్రం జగన్‌పై ప్రతీకారం ఎందుకు తీర్చుకోకూడదు? తాను లేకపోతే జగన్ పరిస్థితి ఏవిదంగా ఉంటుందో తెలియజేసేందుకే విజయసాయి రెడ్డి గుడ్ బై చెప్పేసి ఉండొచ్చు.
ఇదివరకు షర్మిల, ఆ తర్వాత విజయమ్మలు జగన్‌ని కాదనుకొని బయటకు వెళ్ళిపోయారు. లేదా గెంటివేయబడ్డారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది.
ఇంతకాలం జగన్‌ని వేలు పట్టుకొని నడిపిస్తూ, ఆయన ఆత్మలా, ఆయన నీడలా వెన్నంటి ఉండే విజయసాయి రెడ్డి పార్టీని వీడి వెళ్ళిపోతే, పార్టీలో మిగిలిన నేతలకు, కార్యకర్తలకు ఎటువంటి సందేశం వెళుతుందో ఊహించుకోవచ్చు.
వైసీపీలో ఓ వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణ రెడ్డిని ఓటమి తర్వాత జగన్ పక్కన పెట్టేసినప్పుడు, తనకు అలవాటు లేని ప్రెస్‌మీట్‌లు పెట్టి మాట్లాడవలసి వస్తోంది. అలాగే ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడంతో జగన్ తరపున ఢిల్లీలో పైరవీలు చేసేవారు ఉండరు. ఆయన కేసులలో కదలికలు మొదలైతే అడ్డుకునే వారుండరు.
ఒకవేళ ఈ కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందంటే విజయసాయి రెడ్డి అప్రూవరుగా మారితే జగన్ జైలుకి వెళ్ళక తప్పదు. వెళితే వైసీపీని కాపాడేందుకు తల్లీ లేదు చెల్లీ లేదు.. ఢిల్లీలో చక్రం తిప్పి అడ్డుకునేందుకు విజయసాయి రెడ్డి కూడా ఉండరు. కనుక ఆయన జగన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకే రాజీనామా చేసి ఉండొచ్చు. అవునో కాదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
విజయసాయి రెడ్డి తర్వాత ఎవరు? అంటే అయోధ్య అంటున్నారు కానీ అవినాష్ అయితే?అప్రూవరుగా మారితే?