పసలేని కేసులో అచ్చెన్నాయుడుని ఇరికించారా?

Atchannaidu Arrested: Complete Details of the Alleged Scamమాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారింది. 151 కోట్ల ఈఎస్ఐ స్కాం లో ఆయనను కస్టడీలోకి తీసుకున్నట్టు ఏసీబీ ప్రకటించింది. అయితే ఆయన రిమాండ్ రిపోర్టు లో మాత్రం వేరుగా ఉంది. 151 కోట్ల ఈ స్కాం లో అచ్చెన్నాయుడు వల్ల ప్రభుత్వానికి కేవలం మూడు కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

151 కోట్లు అవినీతి జరిగినా అచ్చెన్నాయుడు పాత్ర మాత్రం మూడు కోట్ల వరకే. అలాగే, మొత్తం రిపోర్టులో ఆయన పాత్ర గురించి ఒక్కటే మాట – మంత్రిగా ఆయన ఫలానా కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వండి అని లేఖ రాశారని. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే….ఇప్పుడు వివాదాస్పదమైన సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.

ADVERTISEMENT

ఈ మూడు కోట్లు జగన్ ప్రభుత్వమే క్లియర్ చేసిందని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా… అచ్చెన్నాయుడు చెప్పారని కాంట్రాక్టు ఇచ్చిన సదరు సంస్థ మీద కేసు నమోదు చెయ్యలేదు. అదే సమయంలో అచ్చెన్నాయుడు ఆ కంపెనీ ద్వారా లబ్ది పొందినట్టు కూడా రుజువు చెయ్యలేదు.

దానితో ఇది అవినీతి కేసు కాకుండా… నిధుల దుర్వినియోగం కేసు అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో బాధ్యత అధికారులదే. వీటి అన్నిటి బట్టి కేవలం కక్షసాధింపు కోసమే అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారని వారు అంటున్నారు. పసలేని కేసులో అచ్చెన్నాయుడుని ఇరికించారు అని వారు ఆరోపిస్తున్నారు. కోర్టులలో ఏం జరుగుతుంది అనేది చూడాలి.

Confused & Not Sure What to Watch on Amazon Prime, Netflix? Click Here

ADVERTISEMENT
Latest Stories