గంటాని పార్టీ నుండి వెళ్ళగొట్టేదాకా ఊరుకునేలా లేరుగా!

ayyanna patrudu ganta srinivasఇటీవలే గంటా శ్రీనివాసరావు పార్టీ మీద తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. ఆయన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి అయితే చివరి నిముషంలో ఏవో సర్దుబాటు చేసారు. అయితే గంటాని పార్టీ నుండి వెళ్ళగొట్టేదాకా ఊరుకునేలా లేరు ఆయన సహచరమంత్రి అయ్యన్న పాత్రుడు.

ADVERTISEMENT

గంటాకు నాకు ఏమైనా భూమి గొడవలున్నాయా..? వ్యాపార విభేదాలున్నాయా? ఆస్తి తగాదాలున్నాయా..? అంటూనే ఆయనపై ఇండైరెక్టుగా విమర్శలు చేశారు ఒక ఇంటర్వ్యూలో. నర్సీపట్నం నుంచే రాజకీయం ప్రారంభించానని ఇక్కడే రిటైరవుతానని అయ్యన్న వ్యాఖ్యానించారు. గంటాను ఉద్దేశించి కొందరు అక్కడికి ఇక్కడికి మారుతుంటారని.. నేను మాత్రం ఒకే స్థానంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజల ఆదరణతో గెలిచానన్నారు.

విశాఖలో భూ కుంభకోణాల సిట్‌ నివేదిక సీఎస్‌ స్థాయిలో పరిశీలనలో ఉందని.. దాన్ని ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు. తద్వారా దోషులెవరో తెలుస్తుందన్నారు. గంటా ఇందులో ఉన్నారని మొదటినుండీ అయ్యన్న ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories