AP Assembly Speaker Ayyannapatrudu

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఈరోజు శాసనసభలో ప్రధాన ప్రతిపక్షనాయకుడు హోదా గురించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత మీడియా చేస్తున్న దుష్ప్రచారం గురించి శాసనసభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.

సాధారణంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత స్పీకర్‌ని ఎన్నుకుంటారు. ఆ తర్వాత నియమ నిబంధనలు, సభా సాంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా? అని స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారు.

Also Read – కేసీఆర్‌, జగన్‌: దొందూ దొందే…

“జూన్ 21న శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం, అ మర్నాడు అంటే జూన్ 22న స్పీకర్‌ ఎన్నిక జరిగింది. స్పీకర్‌ ఎన్నిక జరుగక ముందే జగన్‌ తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని దుష్ప్రచారం ప్రారంభించేశారు.

ఈ ప్రయత్నంలో భాగంగా హైకోర్టులో ఓ పిటిషన్‌ వేసి దానిని పేర్కొంటూ, హైకోర్టు స్పీకర్‌కి నోటీస్ పంపిందంటూ దుష్ప్రచారం కూడా చేయించారు. స్వయంగా తాను కూడా చేస్తూనే ఉన్నారు.

Also Read – అమరావతి ‘పట్టాభిషేకం’…వైసీపీ ‘అరణ్యవాసం’..!

తద్వారా జగన్‌ హైకోర్టు చెప్పని విషయాలు చెప్పిన్నట్లు అటు హైకోర్టుని, ఇటు ప్రజలను కూడా తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ దుష్ప్రచారం గురించి సభ్యులకు, ప్రజలకు తెలియజేయాలనే నేను ఈ రూలింగ్ ద్వారా ఈ విషయాలన్నీ సభాముఖంగా తెలియజేస్తున్నాను,” అని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చెప్పారు.




జగన్‌ పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడం భాద్యతారహిత్యమే. పైగా గౌరవనీయ శాసనసభ స్పీకర్‌ పట్ల ఈవిదంగా దుష్ప్రచారం చేస్తుండటం మరో తప్పు. ఈ ప్రయత్నంలో తన కుట్రలను హైకోర్టుకి ఆపాదించడం ఇంకా పెద్ద తప్పు. ఇన్ని తప్పులు చేస్తున్నా జగన్‌ ఇంకా విలువలు, విశ్వసనీయత అంటూ నిసిగ్గుగా నీతులు చెపుతూనే ఉన్నారు. కనుక ఈ విషయాలు ప్రజలకు తెలియజేయడం చాలా మంచి నిర్ణయమే.

Also Read – అనుభవానికి…ఆవేశానికి మధ్య గీత ఇదేనా.?