“బాహుబలి 2”పై టాలీవుడ్ కు కుళ్ళు!

Baahubali 2 Trailer Comments by Ram Gopal Varmaసునామీలా యూ ట్యూబ్ ను ఓ కుదుపు కుదుపుతూ, సరికొత్త చరిత్రను సృష్టిస్తున్న “బాహుబలి 2” ట్రైలర్ కు వీక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఇప్పటికే తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. ఆ జాబితాలో విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, అఖిల్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్, రామ్ వంటి హీరోలు ఉండగా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇతర సినీ సెలబ్రిటీలు తమ అనుభూతులను పంచుకున్నారు.

అయితే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న పవన్, మహేష్ లు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. బహుశా ఇదే ఆలోచన వర్మ మదిలో మెదిలిందేమో గానీ, “ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటున్న “బాహుబలి 2” ట్రైలర్ ను టాలీవుడ్ అభినందించకుండా సైలెంట్ గా ఉండడానికి కారణం కుళ్ళు సముద్రంలో మునిగిపోవడం వలన” అంటూ ట్వీట్ చేసారు. అయితే దీనిపై నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

సోషల్ మీడియాలో అసలు యాక్టివ్ గా ఉండని హీరోలలో పవన్, మహేష్ పేరులే ముందు వరుసలో ఉంటాయి. వారిద్దరూ మినహాయిస్తే… సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోలంతా తమ అభిప్రాయాలను వెల్లడించిన వారే. బహుశా వెంకటేష్, ఎన్టీఆర్, రామ్, అఖిల్… వీళ్ళంతా టాలీవుడ్ కు చెందిన వారు కాదేమోనని వర్మ అనుకుంటున్నారేమో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇది పవన్ అండ్ కోను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని వర్మ ట్వీట్ కు వస్తున్న స్పందనలు చూస్తే అర్ధమవుతుంది.

ADVERTISEMENT
Latest Stories