అరచేతిలో ‘బాహుబలి’ని ఒక ఆట ఆడుకోవచ్చు!

Baahubali Game (2)రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ హీరోగా తెరకెక్కిన “బాహుబలి” సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం రెండవ పార్ట్ కూడా సన్నద్ధమవుతున్న తరుణంలో… ఈ సినిమాను వీడియో గేమ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవల ‘ఖైదీ నంబర్ 150’ విడుదలైన తర్వాత మెగాస్టార్ కు సంబంధించి, ఒక వీడియో గేమ్ ను రూపొందించగా, అది గేమ్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

తాజాగా “బాహుబలి” రేంజ్ అంతకు మించినది కావడంతో గతంలో ‘ఫార్మ్ విల్లే, లార్డ్ ఆఫ్ రింగ్స్’ వంటి గేమ్స్ ను రూపొందించిన మార్క్ సాగ్స్ ఆధ్వర్యంలో ‘బాహుబలి’ గేమ్ సిద్ధమవుతోంది. అతి త్వరలోనే ఈ గేమ్ ను స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇది విడుదలైతే, ‘బాహుబలి’ స్థానంలో మీరే ఉండి, కాలకేయుడితో పోరాడవచ్చన్న మాట. దీంతో ‘బాహుబలి’ గేమ్ కోసం టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories