టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న నేపథ్యంలో వారి అభిమానుల సందడి ఎక్కువైంది. కానీ, వీరిద్దరు మాత్రం తమ మధ్య ఎలాంటి పోటీ లేదని… ఇద్దరి సినిమాలు బ్లాక్ బస్టర్లు కావాలనే ధోరణిలో ఉన్నారు. బాలయ్య సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించిన విషయం తెలిసిందే.
ఇక బాలయ్య విషయానికి వస్తే… తన కారులో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా పాటలను వింటున్నారట. ముఖ్యంగా ‘నీరు నీరు నీరు’ అనే పాటను ప్రత్యేకంగా వింటున్నారట. అభిమానులు కూడా వీరిద్దరినీ ఫాలో అయితే… ఏ సమస్యా ఉండదని అంటున్నారు నెటిజన్లు. ఈ ఇద్దరి హీరోల అభిమానుల ప్రవర్తన ఏకంగా డీజీపీ పరిధిలోకి వెళ్ళిందంటే ఏ స్థాయిలో సోషల్ మీడియాలో గొడవ పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
ADVERTISEMENT
ADVERTISEMENT



