హైదరాబాద్ లో ‘బాలయ్య’ హిందూపురం ‘పంచాయితీ’

Balakrishna-settlements-in-hyderabadటీడీపీకి కంచుకోట అయిన హిందూపురంలో పార్టీలో నెలకొన్న సంక్షోభానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. బాలయ్య పీఏ శేఖర్ ను సాగనంపాలని ఒక వర్గం… అతన్నే కొనసాగించాలని మరో వర్గం పట్టుబట్టడంతో… నియోజకవర్గంలో అలజడి చెలరేగింది. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానిక నేతలైన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు, టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణలతో శుక్రవారం నాడు టెలిఫోన్ లో సంభాషించారు.

ADVERTISEMENT

గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయాలపై తాను చాలా కలత చెందానని, ఇది ఒక కుటుంబ సమస్య లాంటిదని… అందరం కలిసి చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుందామని ఆయన తెలిపారు. ఇకపై అందరూ విభేదాలను పక్కన పెట్టి, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిద్దామని బాలయ్య సూచించారు. అంతేకాదు, ఈ నెల 28న అందరూ హైదరాబాద్ కు రావాలని… ఇక్కడ కూర్చుని అందరం చర్చిద్దామని పిలిచారు.

పీఏ శేఖర్ వల్ల నియోజకవర్గంలో టీడీపీ రెండుగా చీలే ప్రమాదం ఏర్పడటంతో… పార్టీ ప్రతినిధిగా హిందూపురంకు వచ్చిన కృష్ణమూర్తి, స్థానిక నేతలతో మాట్లాడి బాలయ్యకు ఓ నివేదిక అందించారు. ఈ నేపథ్యంలోనే నేతలందరినీ హైదరాబాద్ కు రావాలంటూ బాలయ్య పిలుపునివ్వడంలో, అనంతపురం పంచాయితీ కాస్త హైదరాబాద్ కు షిఫ్ట్ చేసినట్లు కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories