బండ్ల గణేష్ కు బానే పనయ్యిందిగా

Bandla Ganesh in Sarileru-Neekevvaru-బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో నిర్మాతగా సక్సెస్ లేదు, రాజకీయాలలో ట్రై చేద్దామని కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా ప్రగల్బాలు పలికి తెలంగాణ ఎన్నికల అనంతరం దాదాపు మీడియాకు దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఆయన కెమెరా ముందుకు తిరిగి వస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆయన ఒక కీలకమైన పాత్ర చేస్తున్నారు. ఈ రోజు నుండి ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ తో సెకండ్ షెడ్యూల్ ని కొనసాగిస్తున్నాడు.

ADVERTISEMENT

ట్రైన్ ట్రావెలింగ్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో బండ్ల కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ సినిమాకు గానూ బండ్ల గణేష్ కు రోజుకు ఏకంగా ఐదు లక్షలు ఇవ్వడానికి చిత్రబృందం ఒప్పుకుందట. ఒక్కప్పుడు బాగా బాగున్న రోజులలో బ్రహ్మానందానికి అంత ముట్టేది. ఈ సినిమా గనుక హిట్ అయితే బండ్ల గణేష్ పంట పండినట్టే. బండ్ల గణేష్ చివరి సారిగా 2012లో విడుదలైన బిజినెస్ మాన్ సినిమాలో నటించారు. అది కూడా మహేష్ బాబు సినిమానే కావడం విశేషం.

ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటిదాకా చిన్న హీరోల తో పని చేసిన ఆమె ఈ చిత్రంతో పై స్థాయికి వెళ్లబోతుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణగా కనిపించబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories