bangladesh

ప్రభుత్వ తప్పిదాలు, ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకత కారణం ఏదైనా కావచ్చు, కొన్ని దేశాలు నిరసనలతో అట్టడుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు నడుపుతున్న పెద్దల పాలనా రాహిత్యం కావచ్చు, బాధ్యత రాహిత్యం కావచ్చు లేక నియంతృత్వ ధోరణి కావచ్చు వాటి పరిణామం ఊహకు అందనంత స్థాయిలో బయటకు వస్తుంది.

Also Read – టీడీపీలో ఆరోపణలు వచ్చాయి..ఆదేశాలు వెళ్లాయి..మరి వైసీపీలో.?

ప్రభుత్వాల పట్ల ప్రజలలో నమ్మకం సన్నగిల్లితే ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తాయో మొన్న శ్రీలంక ఘటన మరువక ముందే నేడు బంగ్లాదేశ్ ఘటన రుజువుచేస్తుంది. ప్రజల మధ్య పెరుగుతున్న తీవ్ర ఆర్థిక అసమానతలు కూడా ఇటువంటి విధ్వంసాలకు, అల్లర్లకు మూలకారణంగా చెప్పవచ్చు.

నేడు శ్రీలంక ప్రాంతంలో నెలకొన్న ఆర్థిక ద్రవ్యోల్భణంతో ఇబ్బందులపాలవుతున్న ప్రజలు దేశ ప్రధాని ఇంటి మీదే నిరసనకు వెళ్లి ఆ ప్రాంతమంతా తమ ఆధీనంలోకి తీసుకుని అల్లకల్లోలం సృష్టించారు. దీనితో లంక ప్రధాని దేశాన్ని విడిచి పొరుగు రాష్ట్రాలలో తలదాచుకునే పరిస్థితి వచ్చింది. లంక ఆర్మీ పరిస్థితిని చక్కదిద్ది ఆందోళన కారులను, నిరసనకారులను అదుపులోకి తీసుకువచ్చారు.

Also Read – తెలీని విషయాలు మాట్లాడి నవ్వులపాలవడం దేనికి?

అయితే ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేయాలి అనే డిమాండ్ తో ప్రభుత్వం పై నిరసన మొదలుపెట్టిన ఆందోళనకారుల నిరసన నేడు దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయే వరకు వచ్చింది. ప్రధాని హసీనా అధికారిక నివాసాన్ని చుట్టుముట్టిన ఆందోళన కారులు హసీనా ఇంటిలోకి వెళ్లి వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అలాగే ఆ ఇంట్లో ప్రధాని వాడే దుస్తులు, ఇతరత్రా సామాను దోచుకొవడం, బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబూర్ రెహమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఢాకా ను మరో శ్రీలంకగా మార్చేశారు. ప్రజలలో ప్రభుత్వాల పట్ల ఎందుకు ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక్కసారి అన్ని దేశాల ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విపత్కర సంఘటనలుగా వీటిని పేర్కొనవచ్చు. తప్పెక్కడ జరుగుతుంది. ప్రభుత్వాలదా ప్రజలదా.?

Also Read – పవన్ ఇచ్చేశారు… జగన్‌ పుచ్చుకుంటున్నారు!

నేడు శ్రీలంక ఎదుర్కున్న పరిస్థితులను నాడు బంగ్లాదేశ్ లో ఎదురుపడ్డాయి. రేపు..? సమస్యను తమ అలసత్వంతో, తమ రాజకీయ కారణాలతో మొక్కలోనే తుంచకుండా పెంచి పోషించినట్లయితే అది ఎదో రోజు మహా వృక్షంగా మారి ఆ ప్రభుత్వాన్ని సునామి మాదిరి కంపింపచేస్తాయి అనేది ఈ రెండు సంఘటనలతో రుజువయ్యింది. ఈ రెండు దేశాలలో నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసాయి.

అయితే ప్రస్తుతానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పెద్దగా ఆ దేశ రచయిత, ప్రొఫెసర్ సలీముల్లా ఖాన్ నియమితులయ్యారని సమాచారం.