Basavatarakam Cancer Hospital

నందమూరి బాలకృష్ణ మానస పుత్రిక అయిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఇన్నాళ్లు హైద్రాబాద్ లో సేవలందిస్తూ అనేకమంది కాన్సర్ బాధితులకు ఊపిరి పోసింది.

అయితే ఇప్పుడీ సేవలు ఏపీ ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు బాలయ్య. నేడు హైద్రాబాద్ లోని బసవరాతకం ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ను ప్రారంభించిన సందర్భంలో త్వరలో ఈ కాన్సర్ హాస్పిటల్ ఏపీ రాజధాని అమరావతిలోని తుళ్లూరు ప్రాంతంలో మరికొన్ని నెలలో ప్రారభించబోతున్నట్టు ప్రకటించారు బాలకృష్ణ.

Also Read – వైసీపీ కి జనసేన… బిఆర్ఎస్ కు బీజేపీ..?

పేదలకు అందుబాటు ధరలలో ఈ కాన్సర్ మహమ్మారికి మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకు రావడమే ఈ బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ప్రథమ ఉద్దేశం అంటూ వ్యాఖ్యానించిన ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ ఈ సేవలను మరింత విస్తరించడం తనకు ఆనందాన్ని కలిగించిందంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఒక నటుడిగా, హిందూపూర్ ఎమ్మెల్యే గా పద్మ అవార్డు గ్రహీతగా రోజురోజుకి తన స్థాయి పెంచుకుంటూ ఈ రకంగా ఇటు కాన్సర్ పేషన్ట్లకు, సమాజానికి తమవంతు కృషి చేయడం నిజంగా అభినందనీయమనే చెప్పాలి. షాపింగ్ కాంప్లెక్స్ లు, మాల్స్ వంటి నిర్మాణాలతో వ్యాపార దిశగా కాకుండా ఇలా సేవాభావంతో కూడిన నిర్మాణానికి బాలయ్య వేసిన తొలి అడుగు పలువురికి స్ఫూర్తినియం.

Also Read – అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం.. భేష్!


తన తల్లి గుర్తుగా స్థాపించిన ఈ బసవతారకం ఎంతోమంది తల్లుల కన్నీటిని తుడిచింది, మరెంతో మంది తల్లులకు పునర్జన్మ నిచ్చింది. దీనితో ఇక నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బసవతారకం కాన్సర్ వైద్యం అందుబాటులోకి రానుంది. అయితే ఈ కాన్సర్ వ్యాధికి మందులకంటే మనోధైర్యమే ముఖ్యమంటున్నారు బాలకృష్ణ.