ఒకప్పుడు భారతీయ సినిమాలలో విలన్ పాత్రలు, నెగెటివ్ పాత్రలు కొందరే చేసేవారు. చిరంజీవి, రజినీకాంత్ వంటి హీరోలు వారు నెగెటివ్ పాత్రలు చేసి మెప్పించారు. ఆనాడు సినిమాలలో ఎక్కువ రేప్ సీన్స్ చేసిన గిరిబాబుని చూసి ఆ రోజుల్లో మహిళలు భయపడేవారంటే ఆయన విలన్, నెగెటివ్ పాత్రలలో ఎంతగా మెప్పించారో అర్దం చేసుకోవచ్చు.
ఆ తర్వాత క్రమంగా హీరోలకు ధీటుగా విలన్ పాత్రలు, పాత్రధారులు కూడా పుట్టుకొచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ మరో అడుగు ముందుకు వేసి మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బాలీవుడ్, కోలీవుడ్‌ల నుంచి కూడా విలన్లను దిగుమతి చేసుకొంది. అలా వచ్చినవారు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
Also Read – విదేశాలకు రేషన్ బియ్యం రవాణా ఏవిదంగా అంటే..
ఒకప్పుడు ఫ్యామిలీ హీరో పాత్రలు చేసిన జగపతి బాబు, కామెడీ సినిమాలు చేసుకునే సునీల్ ఇద్దరూ విలన్ పాత్రలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచే వారికి ప్రత్యేక గుర్తింపు పొందుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
అయితే టాలీవుడ్‌లో స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ పుష్ప-1,2లలో ఎర్ర చందనం స్మగ్లర్‌గా నెగెటివ్ పాత్ర చేస్తుండటం, దానికి దేశ ప్రజలు బ్రహ్మరధం పడుతుండటం గమనిస్తే, సమాజం ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చిన్నట్లు అర్దమవుతుంది.
Also Read – సీక్వెల్స్: వైఫల్యం నుండి విజయం వరకు
గరికపాటి వంటి పండితులు ఈ ధోరణిని తప్పు పడుతున్నప్పటికీ, వయసుతో సంబందం లేకుండా ప్రేక్షకులు అందరూ దీనిని కేవలం సినిమాగానే చూస్తున్నారు. ఆదరిస్తున్నారు. కనుకనే విలన్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసేందుకు పెద్ద హీరోలు కూడా సంకోచించడం లేదు.
ఇదేవిదంగా ఒకప్పుడు ఐటం సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా తెలుగులో జ్యోతీలక్ష్మి, జయమాలిని వంటివారు ఉండేవారు. వారు తమ డాన్సులతో ప్రేక్షకులను ఎంత రంజింప జేసినా ఆ కాలంలో అలా చేయడాన్ని సమాజం హర్షించేది కాదు. కనుక వారికి అంత గౌరవం లభించేది కాదు.
Also Read – జగన్ చివరి ఆశ అదే?
కానీ ఇప్పుడు ఐటం సాంగ్స్ చేయడానికి స్టార్ హీరోయిన్లు పోటీ పడుతున్నారు. పుష్ప-1 లో సమంత, పుష్ప-2లో శ్రీలీల ఇందుకు నిదర్శనంగా కనబడుతున్నారు. వారు అందుకు తగ్గ ప్రతిఫలం పొందడమే కాకుండా, ఐటం సాంగ్స్ చేస్తే సమాజంలో మరింత పాపులర్ అవుతున్నారు. మరింత అభిమానం, పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటున్నారు.
ఇంతవరకు దేశంలో జరిగిన సినిమా ప్రమోషన్స్ అన్నీ ఒక లెక్క.. పుష్ప-2 మరో లెక్క అన్నట్లు నిర్మాతలు భారీగా డబ్బు ఖర్చు పెడుతూ కనీవినీ ఎరుగని స్థాయిలో పుష్ప-2 ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దక్షిణాది సినిమాలను పెద్దగా పట్టించుకోని బిహార్ రాష్ట్రంలో పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌కి సుమారు రెండున్న లక్షల మంది వచ్చారంటే పుష్ప-2 ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు.
కనుక భారతీయ సినీ పరిశ్రమలో, ఇటు భారతీయ సమాజంలో వచ్చిన ఈ పెను మార్పుల తర్వాత మరే కొత్త మార్పులు వస్తాయో?