భీమ్లానాయ‌క్ ను ఘోర‌మైన దెబ్బ కొట్టిన జ‌గ‌న్‌.. ఇదే సాక్ష్యం..!

bheemla nayak movie Collections in Andhra Pradeshటాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమా వ‌స్తుందంటేనే క‌లెక్ష‌న్ల వ‌ర‌ద పారుతుంది. స‌రికొత్త రికార్డులు న‌మోద‌వుతాయి. అయితే కొవిడ్ కార‌ణంగా ఇన్ని రోజులు పెద్ద హీరోల సినిమాలు రాలేదు. గ‌తేడాది అఖండ‌, పుష్ప త‌ర్వాత రెండు నెల‌ల గ్యాప్ తీసుకుని భీమ్లానాయ‌క్ బ‌రిలోకి దిగింది మామూలుగానే ప‌వ‌న్ సినిమా అంటే ఓ రేంజ్‌లో అంచ‌నాలు ఉంటాయి. పైగా ఇది ఆల్రెడీ హిట్ మూవీకి రీమేక్‌ కావ‌డం, ఇందులో రాణా కూడా ఉండ‌టంతో హైప్ బాగా పెరిగింది.

అంద‌రూ ఊహించ‌న‌ట్టు గానే మొద‌టి రోజే సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప‌వ‌న్‌కు వ‌కీల్ సాబ్ త‌ర్వాత వ‌రుస‌గా రెండో విజ‌యం ఇది. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు రాణా అభిమానులు కూడా పండ‌గ చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీతో ప‌వ‌న్ స‌రికొత్త రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. మొద‌టి రోజు అంత‌లా క‌లిపి రూ.36.37 కోట్లు వ‌సూలు చేసింది. నైజాంలో అయితే పుష్ప రికార్డును తిర‌గ‌రాసేసింది.

ADVERTISEMENT

దీంతో రెండు రోజుల్లో క‌లిపి చాలా వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ ను రిక‌వ‌రీ చేస్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏపీలో పెద్ద షాక్ త‌గిలింది. రెండు రోజుల్లో క‌లిపి తెలంగాణ‌లో 64శాతం రిక‌వ‌రీ చేయ‌గా.. ఏపీలో మాత్రం కేవ‌లం 39శాతమే రికవ‌రీ చేసింది. వాస్త‌వానికి టాలీవుడ్‌కు రెవెన్యూ ఏపీ నుంచే ఎక్కువ వ‌స్తుంది. ఏపీలోనే థియేట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నాయి. ప్ర‌తి సినిమాకు 60శాతానికి పైగా ఏపీ నుంచే రెవెన్యూ వ‌స్తుంది.

ప‌వ‌న్‌కు వీరాభిమానులు కూడా ఏపీలోనే ఎక్కువ‌గా ఉన్నారు. అలాంటిది ఏపీలో ఇంత త‌క్క‌వ రిక‌వ‌రీ శాతం ఉండ‌టంతో అంతా షాక్ అయిపోతున్నారు. దీనికి రెండు కార‌ణాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. టికెట్ల రేట్లు త‌గ్గించి అమ్మ‌డం ఒక‌టి అయితే.. ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌ల కార‌ణంగా చాలా థియేట‌ర్లు షోలు వేయ‌లేదు. పైగా టికెట్లు బ్లాక్ చేయ‌కుండా.. రెవెన్యూ ఉద్యోగుల‌ను కాప‌లాగా పెట్టింది.

సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న భీమ్లానాయ‌క్ రెండో రోజే ఏపీలో లాభాల్లోకి అడుగు పెట్టాలి. కానీ విచిత్రంగా తెలంగాణ కంటే వెన‌క‌బ‌డిపోయింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మొత్తానికి భీమ్లానాయ‌క్ రేంజ్‌ను త‌గ్గించేసింద‌నే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories