అఖిలప్రియ క్లారిటీ ఇచ్చారా? ఇంకా జటిలం చేశారా?

Bhuma Akhila -Priya -Reddy clarity on Joininig Janasenaఏపీలో మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. మంత్రిగా ఉన్న ఆమె పార్టీ మారడం ఖాయమని జనసేన వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ మారే ప్రసక్తేలేదని, కొన్ని పత్రికలు పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వళ్లే ఆళ్లగడ్డకు నీళ్లు వచ్చాయి… నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆళ్లగడ్డలో మళ్లీ గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని ప్రకటించారు ఆమె.

ADVERTISEMENT

ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని… నా తల్లీతండ్రులు చూపిన బాటలోనే నడిస్తానని తెలిపారు. అయితే సమస్య ఇంతటితో ముగిసిపోయింది అనుకుంటే పొరబాటే. ఆళ్లగడ్డ నియోజకవరంలోని సిరివెళ్ల గ్రామంలో సీఎం చంద్రబాబు ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు అఖిలప్రియ అనుచరులు సీఎం ఫోటో ఉన్న ఫ్లెక్సీలు తొలగించి కేవలం మంత్రి ఫోటో ఉన్న ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేశారు. అలాగే పచ్చ కండువా లేకుండానే మంత్రి నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు.

ఆళ్లగడ్డలో బలిజ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో అక్కడ నుండి జనసేన తరపున పోటీ చేస్తే గెలవడం తేలిక అని అఖిలప్రియ అభిమతం అని తెలుస్తుంది. 2014 ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించడంతో అనివార్య పరిస్థితులలో రాజకీయాలలోకి వచ్చారు ఆమె. ఉపఎన్నికలలో ఎమ్మెల్యే అయ్యి ఆ తరువాత తండ్రి భూమా నాగిరెడ్డితో పాటు వైకాపా వీడి టీడీపీ చేరారు. 2017లో ఆయన అకాల మరణం చెందడంతో ఆవిడకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది టీడీపీ ప్రభుత్వం.

అయితే మొదటి నుండి ఆమె ప్రవర్తన అటు పార్టీతో పాటు భూమా వర్గీయులను కూడా ఇబ్బంది పెడుతుంది. అనూహ్యంగా రాజకీయాలలోకి వచ్చి అతి చిన్నవయసులోనే మంత్రిగా ఎదిగిన ఆమె ఇటువంటి కీలక తరుణంలో ఏం చేయ్యబోతున్నారో చూడాలి. ఒకవేళ 2019లో గనుక ఓడిపోతే దానికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కర్నూల్ రాజకీయాల నుండి మొత్తానికి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.దీనితో పార్టీ మారడానికి మరి కొంత సమయం తీసుకోవాలని ఆవిడ అనుకుంటున్నారా?

ADVERTISEMENT
Latest Stories