విషమ పరిస్థితిలో భూమా నాగిరెడ్డి?

Bhuma Nagi Reddy heart attackవైసీపీ నుండి టిడిపిలోకి వచ్చిన కర్నూలు జిల్లా, నంద్యాల టిడిపి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమ పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆళ్లగడ్డలో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు భూమా. దీంతో వెంటనే స్థానిక ఆళ్లగడ్డ ఆసుపత్రిలో చేర్చగా, భూమా పరిస్థితిని గమనించిన డాక్టర్లు, కేవలం ప్రాధమిక చికిత్స మాత్రమే అందించి వెంటనే నంద్యాలకు తరలించాల్సిందిగా సూచించారు.

ADVERTISEMENT

అయితే నంద్యాల ఆసుపత్రిలో వైద్యం నిర్వహిస్తున్నప్పటికీ, అత్యాధునిక సౌకర్యాలు కొరవవ్వడంతో, హెలికాఫ్టర్ లో హైదరాబాద్ కు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అలాగే కూతురు అఖిల ప్రియతో కూడా సిఎం సంభాషించి, ధైర్యం చెప్పినట్లుగా సమాచారం. దీంతో భూమా ఆరోగ్య పరిస్థితి విషమ స్థితిలో ఉందన్న విషయం ఖరారైంది. కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అనుచరులంతా నంద్యాల హాస్పిటల్ కు చేరుకొని కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ప్రస్తుతం భూమా తనయురాలు అఖిల ప్రియ అహోబిలంలో బ్రహ్మోత్సవాలలో ఉండగా, ఈ సమాచారం తెలుసుకుని హుటాహుటిన బయలుదేరారు. గతంలో భూమా నాగిరెడ్డికి రెండు సార్లు హార్ట్ ఎటాక్ రావడంతో, ఈ సారి పరిస్థితి మరింత విషమంగా మారినట్లు తెలుస్తోంది. భూమా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో, పలువురు ఔత్సాహికులు కాస్త తొందరపాటును ప్రదర్శిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కడ కూడా ‘మెలో డ్రామా’లకు అవకాశం లేకుండా, మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో అంబులెన్స్ నుండి భూమాను హాస్పిటల్ కు చేర్చడం మీడియాలలో రికార్డైంది.

ADVERTISEMENT
Latest Stories