వైసీపీ నిందితులను వదిలి టిడిపిపై ఎదురు కేసులా?

Bhumareddy Ramgopal Reddy Is it a counter case against TDP leaving YCP accusedకర్నూలు జిల్లాలోని ఆలూరు పట్టణంలో బుదవారం ఆలూరు టిడిపి ఇన్‌చార్జ్ కోట్ల సుజాతమ్మ అధ్యక్షతన టిడిపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి భూమారెడ్డి రాంగోపాల్ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వైసీపీ గూండాలు మన టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తారు. హత్యలు చేస్తుంటారు. నగ్న వీడియోలు చేస్తుంటారు. మొబైల్ ఫోన్లలో మహిలలతో అశ్లీల సంభాషణలు చేస్తుంటారు. కానీ వారెవరి మీద పోలీసులు కేసులు నమోదు పెట్టరు కానీ ఇదేమిటని ప్రశ్నించిన మన మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తుంటారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు, దౌర్జ్యానాలు మొదలై నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. చివరికి ఉద్యోగులు, ఉపాధ్యాయులను కూడా విడిచిపెట్టకుండా వారిపై కూడా అక్రమ కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి జగన్ ప్రభుత్వం వేదిస్తోంది. దీనికి ఫలితం అనుభవించక తప్పదు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇది రుజువవుతుంది,” అని అన్నారు.

ADVERTISEMENT

ఈ సమావేశంలో తెలుగు రైతు కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి సులక్షణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మీనాక్షీ నాయుడు, మురళీ రెడ్డి, సర్పంచ్‌లు అరుణదేవి, రాజశేఖర్, మోహన్ రాజ్, లక్ష్మన్న, మాజీ ఎంపీపీ భీమలింగప్ప చౌదరి, టిడిపి నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మద్దిలేటి మల్లయ్య, కృష్ణం నాయుడు, ఫాలీ సాహెబ్, సోమశేఖర్, భాస్కర్, చంద్రశేఖర్, తిమ్మయ్య, నరసప్ప, జాహీర్, మండల కన్వీనర్లు అశోక్, షేక్ షా వలీ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ADVERTISEMENT
Latest Stories