పబ్లిక్ గా బట్టలు తీసేశారని ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ పై ఫిర్యాదు!

Big Boss Contestant Swami Om Harasses Woman‘బిగ్ బాస్’ పోటీదారు స్వామి ఓం, ఆయన అనుచరుడితో కలసి తనను వేధించారని, బట్టలూడదీశారని ఓ యువతి ఢిల్లీ పరిధిలోని ఐపీ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం మేరకు… ఈ నెల 7వ తేదీన స్వామి ఓం మరియు ఆయన అనుచురుడు సంతోష్ ఆనంద్ లు కలిసి తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసింది.

“రాజ్ ఘాట్ ప్రాంతంలో నలుగురూ చూస్తుండగానే బట్టలూడదీశారు, బూతులు తిట్టారు, తాను అరిచి కేకలు పెడుతుంటే, అక్కడ చేరుతున్న వారి సంఖ్య పెరగడంతో స్వామి మరియు ఆయన అనుచరుడు పారిపోయారని” పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు యువతి ఫిర్యాదుతో సెక్షన్ 354 కింద కేసు పెట్టి విచారిస్తున్నామని, ఈ యువతికి, స్వామికి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోందని తెలిసినట్లుగా పోలీసులు తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories