Bihar Get Special Allocations in Union Budget 2025

నేడు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పొద్దు పై అప్పుడే ప్రత్యర్థుల నుండి సోషల్ మీడియా యూజర్స్ నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ బడ్జెట్ లో ఎక్కువగా కేంద్ర పెద్దల నుంచి వరాలు అందుకున్న రాష్ట్రం బీహార్ కావడంతో నిర్మలమ్మ దేశ బడ్జెట్ ను బీహార్ ఎన్నికల బడ్జెట్ గా మార్చారా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. ఈ ఏడాది చివరాంకంలో జరగబోయే బీహార్ ఎన్నికల నేపథ్యంలో పొద్దులో ఎక్కువ భాగం బీహార్ రాష్ట్రం మీద శ్రద్ద పెట్టారా అంటూ ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.

Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?

అలాగే అందరికి అర్ధమయ్యే విధంగా వచ్చే వారంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నాం అంటూ నిర్మల ఒక వారం వెనక్కెళ్ళిన వైనం పై కూడా కౌంటర్ పేలుతున్నాయి. త్వరలో జరగబోయే దేశ రాజధానికి ఢిల్లీ ఎన్నికల నేపధ్యం దృష్టిలో ఉంచుకుని బీజేపీ పెద్దలు ఈ కొత్త విధానాన్ని వారం వెనక్కి పంపారని, దీని వలన ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ పై ప్రభావం పడే అవకాశం ఉండడంతోనే నిర్మల వారం వెనక్కి వెళ్లారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

దీనితో ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ కోసం నిధులు వెచ్చించి, పరిశ్రమలను కేటాయించి పెద్ద మనసుతో ముందుకొచ్చిన కేంద్రం, త్వరలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల ఆలోచనతో కొత్త ఆదాయపు పన్ను విధానం పై ఓ వారం వెనకడుగు వేస్తూ ఎన్నికలకు అనుగుణంగా బడ్జెట్ ప్రణాళికలు రూపొందించారు అనేలా ఆర్థిక మంత్రి ప్రసంగం సాగింది అనే వాదన తెరమీదకు రావడంతో బీజేపీ రాజకీయ వ్యూహాల పై ఎవరి అభిప్రాయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా వ్యక్త పరుస్తున్నారు.

Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?


అయితే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ రాష్ట్రం పై మాత్రం ఈసారి నిర్మల సీతకన్నేసారు అంటూ నిట్టూరుస్తున్నారు ఏపీ వాసులు. అలాగే అటు తెలంగాణ విషయంలో కూడా బీజేపీ ఇదే తరహా విధానంతో ముందుకెళ్లడంతో అటు తెలంగాణ లో కూడా బీజేపీ బడ్జెట్ పై రుసరుసలు వినపడుతున్నాయి. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం పెత్తందారీ తనాన్ని అనుసరిస్తుందంటూ పలువురు టి.కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు.