జగన్ ప్రభుత్వం నిద్రపోతోందా?

BJP-MP-CM-Ramesh-Comments-on-Jaganరాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ జగన్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వలననే భద్రాచలం పట్టణం మునిగిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, వారి మంత్రులు పదేపదే ఆరోపిస్తుంటే జగన్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. బహుశః వైసీపీ-టిఆర్ఎస్‌ పార్టీ నేతల మద్య అనుబందాలు, అవసరాలే కారణం అయ్యుండవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే 28.8 లక్షల క్యూసెక్కుల సామర్ధ్యంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో 85 గేట్లను ఎత్తి ఒక్కసారిగా దిగువకి నీళ్ళు విడుదల చేయడం వలననే లోట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వలననే భద్రాచలం పట్టణం మునిగిపోయిందని, ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని గట్టిగా వాదిస్తోంది. పోలవరం ప్రాజెక్టుని ఏదోవిదంగా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే జగన్ ప్రభుత్వం గట్టిగా సమాధానం చెప్పకుండా నిద్రపోతోంది,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో జగన్ ప్రభుత్వం అలసత్వం వలననే నిన్న భద్రాచలం సమీపంలో ఏపీలో ఉన్న 5 గ్రామాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. భద్రాచలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పోదెం వీరయ్య వారితో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. అంటే ఆ గ్రామాల ప్రజలను తెలంగాణ రాజకీయ నాయకులు రెచ్చగొడుతునారాని అర్దమవుతోంది.

ADVERTISEMENT

కానీ జగన్ దృష్టి ఎంత సేపు ఎక్కడ అప్పులు పుడతాయా?దేనిని అమ్మేద్దామా? అనే దానిపైనే ఉంటుంది తప్ప ఇటువంటి సమస్యలపై ఉండదని టిడిపి నేతలు తరచూ ఆరోపిస్తూనే ఉంటుంది. అయినా జగన్ ప్రభుత్వం మేల్కొనడం లేదు. అందుకే అటు ఇచ్చాపురంలో ఏపీ భూభాగాన్ని ఒడిశా ప్రభుత్వం మెల్లమెల్లగా కబళిస్తుంటే, ఇటు భద్రాచలంవైపు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెందిన భూభాగంపై కన్నేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories