బీజేపీ జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చేసినట్టేనా?

bjp-ram-madhav-fires-on-chandrababu-naidu2019 లో తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితిలోను ఓడించి తీరాలని ఎపి భారతీయ జనతా పార్టీ సమావేశం తీర్మానం చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి,అరాచక పాలన చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసిన అధికార టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీగా ఆయన అభివర్ణించారు.

ADVERTISEMENT

[m9ad]

ఇంతకు టీడీపీని ఓడించాలి అంటే బీజేపీ ఎవరిని గెలిపించాలి? బీజేపీ అయితే సొంతగా ఆంధ్రప్రదేశ్ లో గెలిచే అవకాశమే లేదు ఇప్పట్లో. 2014 ఎన్నికల సందర్భంగా మోడీ దగ్గర నుండి అందరు అవినీతిపరుడు అని ఆరోపించిన జగన్ మోహన్ రెడ్డిని గెలిపించారా? బీజేపీ వారు జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్టే అనుకోవాలా?

అయితే అభివృద్ధికి ప్రతిరూపం అని కీర్తించిన చంద్రబాబుపై మోడీ తొందరగానే అభిప్రాయం మార్చుకున్నారు. ఇప్పుడు జగన్ పై అభిప్రాయం మార్చడమూ పెద్ద కష్టం కాక పోవచ్చు. చంద్రబాబును ఓడించడమే ధ్యేయంగా రాజకీయాలు చేస్తే బీజేపీకి జరిగే మంచి ఏమీ ఉండదని ఆ పార్టీ తెలుసుకుంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories