ఇదివరకు మహారాష్ట్రలో బీజేపి అధికారం చేజిక్కించుకోవడం కోసం శివసేనలో ఏక్‌నాధ్ షిండేని కట్టప్పగా చేసుకొని అ పార్టీని నిలువునా చీల్చింది. ఇప్పుడు ఆ కట్టప్ప షిండేకి కూడా బీజేపి షాక్ ఇచ్చేలా ఉంది. మహారాష్ట్రలో షిండే శివసేన-బీజేపి కలిసి మహాయుతి కూటమిగా ఏర్పడి భారీ మెజార్టీతో గెలిచాయి. కూటమి గెలుపులో షిండే చాలా కీలకపాత్ర పోషించారు.
Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?
ముఖ్యమంత్రిగా ఆయన అమలుచేసిన కొన్ని పధకాలు, మళ్ళీ ఎన్నికలలో ఇచ్చిన కొన్ని హామీలు మహాయుతి కూటమికి ఘన విజయానికి ప్రధాన కారణమని ఆయన ప్రధాన అనుచరుడు, పార్టీలో సీనియర్ నేత సంజయ్ శిర్సాట్ చెపుతున్నారు.
మహాయుతి కూటమి విజయానికి కారకుడైన తమ అధినేత ఏక్‌నాధ్ షిండేకి రాష్ట్ర బీజేపి నేతలు, వారి అధిష్టానం కూడా సముచిత గౌరవం ఇవ్వడం లేదని, ఆయనను పక్కన పెట్టేందుకు బీజేపి ప్రయత్నిస్తున్నట్లు తమకు అనుమానం కలుగుతోందని సంజయ్ శిర్సాట్ ఆన్నారు.
Also Read – డాకూ మహరాజ్: గుర్రం దిగక్కరలేదు!
మొదట ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలని పట్టుబట్టిన ఏక్‌నాధ్ షిండే తర్వాత వెనక్కు తగ్గి ‘బీజేపి అధిష్టానం ఎలా నిర్ణయిస్తే అలా..” అన్నారు. కనుక ఆనవాయితీ ప్రకారం ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి పదవి తనకు ఇవ్వాలని, కొన్ని కీలక మంత్రి పదవులు తన పార్టీకి ఇవ్వాలని ఏక్‌నాధ్ షిండే కోరుతున్నారు.
కానీ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపి అధిష్టానం అంగీకరించింది కానీ హోం మంత్రి పదవిని కూడా బీజేపియే తీసుకోవాలని నిర్ణయించడంతో ఏక్‌నాధ్ షిండే తీవ్ర అసహనంతో కీలకమైన కూటమి సమావేశానికి హాజరుకాకుండా తన స్వంత జిల్లాకు వెళ్ళిపోయారు.
Also Read – M9 పాఠకులకు ‘భోగి’ పండుగ శుభాకాంక్షలు..!
నాడు ఏక్‌నాధ్ షిండేతో శివసేనని చీల్చి ఆ పార్టీని చావుదెబ్బ తీసి అధికారం దక్కించుకున్న బీజేపి, ఇప్పుడు ఏక్‌నాధ్ షిండేకి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తుండటం గమనిస్తే, ఏపీలో కూడా భవిష్యత్‌లో బీజేపి ఇదేవిదంగా టీడీపీతో గేమ్ ఆడకుండా ఉంటుందా?అనే సందేహం కలుగుతుంది.