
ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన పట్టభద్రుల ఎన్నికలలో అధికార టీడీపీ పార్టీ ఊహించినట్టుగానే పై చేయి సాధించింది. అయితే ఏపీలో ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న వైసీపీ ఎన్నికల పోటీ నుంచి నిష్క్రమించినప్పటికీ తెర వెనుక రాజకీయం నడిపింది.
గెలిచిన సీట్లు కాదు వచ్చిన ఓట్ల శాతం చూడాలి అంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన వైసీపీ చివరికి ఆ ఓట్లకు భయపడే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది అంటున్నారు కూటమి నేతలు. ఒక వేళ ఈ ఎన్నికలలో వైసీపీ కి ఆ ఓట్ల శాతం కూడా తగ్గితే ఇక ప్రత్యర్థి చేతికి తామే అస్త్రం అందినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో వైసీపీ సైడ్ అయ్యింది అనే ప్రచారం జరుగుతుంది.
Also Read – చంద్రబాబుని చూపిస్తా.. సెంటిమెంట్ రగిలిస్తా!
అయితే అక్కడ తెలంగాణలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలలో తీవ్ర వైతిరేకత చోటు చేసుకుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు విసిగి పోయారు, సెక్యూరిటీ లేకుండా రేవంత్ బయటకొస్తే ప్రజలే రేవంత్ కి బుద్ది చెపుతారు, త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
అప్పుడు బిఆర్ఎస్ సత్తా ఏంటో రేవంత్ సర్కార్ కు తెలిసేలా చేస్తాం అంటూ విర్రవీగుతున్న బిఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల నుంచి తప్పుకున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంట వైతిరేకత కనిపిస్తే ప్రతిపక్షాలు వచ్చిన అవకాశాలను వదులుకుంటారా.?
Also Read – సోము ‘శీల’ పరీక్ష కు సిద్దపడుతున్నారా.?
ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీ చేసి తమ పార్టీ అభ్యర్థులను, తమ పార్టీ మద్దతిచ్చిన నేతలను గెలిపించి రేవంత్ సర్కార్ కు సవాల్ విసరొచ్చు. కానీ బిఆర్ఎస్ కూడా వైసీపీ మాదిరి సైలెంట్ గా సైడ్ అయ్యింది. అయితే అటు బిఆర్ఎస్ పక్కకు తప్పుకోవడంతో అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలచుకుంటూ అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిస్తుంది.
తెలంగాణలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు నడుస్తుండగా మొదటి రౌండ్ కౌంటింగ్ అయ్యే సరికి బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి అధికార పార్టీ అభ్యర్థి మీద 1496 ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి 13198 , బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 10746 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
Also Read – త్రిభాషా…డీలిమిటేషన్ పై పవన్ స్పందన…
దీనితో అటు రేవంత్ సర్కార్ కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వడంతో పాటుగా తమ అభ్యర్థి ని గెలుపు దిశగా తీసుకెళ్లగలుగుతుంది. ఒక వేళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ విజయాన్ని అందుకుంటే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతగా భావించవచ్చు. అలాగే ఇక ప్రతిపక్షాలుగా ఉన్న బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏకతాటి మీదికొచ్చి రేవంత్ పై దూకుడుగా ముందుకెళ్లే ప్రమాదం లేకపోలేదు.