BJP vs AAP: Freebies & Election Politics in Delhi

హస్తినలో వాయు కాలుష్యంతో పాటు ధ్వని కాలుష్యం కూడానా అన్నట్టుగా బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరిగా ఎన్నికల ప్రచారాలు సాగుతున్నాయి. పవర్ లోకి రావాలంటే ‘ఫ్రీ’ పథకాలు తప్పనిసరి అనేలా ఒకరితో ఒకరు పోటీ పడి మరి దేశ రాజధాని ప్రజలకు ఉచిత పథకాలను ఎరగా వేస్తున్నారు.

Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?

ఆప్ నాయకులు హస్తినలో హ్యాట్రిక్ విజయం అందుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డుతుంటే కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ ఈసారి హస్తినలో కాషాయ జెండా ఎగరెయ్యాలని తహతహలాడుతోంది. ఇక గెలుపుకి ఓటమికి మధ్యలో ఉన్న కాంగ్రెస్ ఎవరి గెలుపును అడ్డుకుంటుందో ఎవరి ఓటమిని నిర్దేశిస్తుందో అనే మీమాంసలో ఉంది.

అయితే అభివృద్ధిని చూసి ఓటేయండి, అభివృద్ధి చేస్తాం ఓటేయండి అని అడిగే సంస్కృతి నుంచి ఉచితాలు పంచి ఓటేయండి, ఉచితాలు ఇస్తాం ఓటేయండి అనే సంస్కృతిని తీసుకు వస్తున్న రాజకీయ పార్టీలు అందుకు అనుగుణంగానే హస్తినలో కూడా మహిళా ఓటర్లను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నాయి.

Also Read – బొత్సగారు.. మీ అనుభవమే వృధా అవుతోంది!

ఇప్పటికే ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచితాలకు మరిన్ని ఫ్రీ స్కామ్స్ ను జోడించి కేజ్రీ వాల్ ప్రజల ముందుకెళుతుంటే, ఒకప్పుడు ఉచితాలకు ఆమడ దూరం అనే బీజేపీ కూడా ఈ ఫ్రీ స్కాములో బందీగా మారి పవర్ కోసం సిద్ధాంతాలకు తిరోధకాలు ఇచ్చింది. ఇక కాంగ్రెస్ కూడా ఎటు అధికారంలోకి వచ్చేది లేదులే అని ఆ రెండు పార్టీలకు మించి అన్నట్టుగా పథకాలను ప్రచారం చేస్తుంది.

అయితే ఇక్కడ పేర్లేమైన పథకాలు ఒక్కటే. ఆప్ 2 వేలంటే బీజేపీ 2500 , దానికి మరికొంత జోడించి కాంగ్రెస్ ఇలా మూడు పార్టీల మధ్య రగులుతున్న రాజకీయ పోరు లబ్ధిదారుల పాలిట వరంలా మారిందనే చెప్పాలి. ఒకరు మహిళలకు ఉచిత రవాణా అంటున్నారు, మరొకరు 500 లేక్ వంట గ్యాస్ అంటున్నారు, ఇంకొకరు మహిళలకు ఉచిత ఆర్థిక సాయం అంటూ ప్రకటిస్తున్నారు.

Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?

అసలు ఈ రాజకీయ పార్టీలకు ఆ రాష్ట్ర బడ్జెట్ తో కానీ ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో కానీ సంబంధం లేకుండా ఆటోవాడికి 10 వేలు, అర్చకులకు 18 వేలు, రిక్షా వాడికి 7 వేలు, సైకిల్ నడిపేవాడికి 4 వేలు, నడుచుకుంటూ వెళ్లే వారికీ 2 వేలు, కాలిగా ఉంటే 1500 అంటూ ఇలా పంచుకుంటూ పొతే దాన్ని పాలన అనాలా.? ఓట్ల కోసం ఓటర్లకు ఉచితాలను ఎరగా వేస్తూ అధికారంలోకి వచ్చాకా ఆ పథకాల మాటున వేల, లక్షల కోట్ల స్కాములు చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిపోయింది.

యమునా నదిని కాలుష్య కోరల నుంచి తప్పించి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తెస్తాం అంటూ ఐదేళ్ల కిందట ఆప్ ఇచ్చిన ఎన్నికల హామీలు ఇప్పటికి నెరవేరలేదు.అలాగే పేరుకే దేశ రాజధాని కానీ అక్కడ నివసించేవారికి అది ఒక కాలుష్య భూతం. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఆ కాలుష్యాన్ని నియంత్రించలేదా.? లేక రాష్ట్ర ప్రభుత్వానికి చెయ్యాలి అనే చిత్త శుద్ధి ఉంటే యమునాలో కాలుష్యం తాలూకా విషాన్ని వెలికితీసేవారు కాదా.?




కానీ కేంద్రంలో మూడు సార్లు అధికారాన్ని చేపట్టిన బీజేపీ కానీ రాష్ట్రంలో డబుల్ ధమాకా కొట్టిన ఆప్ కానీ అటువంటి చర్యలకు విలువనివ్వకుండా ఇప్పుడు కాలుష్యంతో రాజకీయ చేసుకుంటూ ఒకరి పై మరొకరు రాజకీయ విషం జిమ్ముకుంటున్నారు. హస్తినలో ఈసారి జరగబోయే ఎన్నికలలో ఆప్ గెలిస్తే ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ అవినీతి కాలుష్యం నుండి బయటపడినట్టే, ఒకవేళ బీజేపీ ని విజయం వరిస్తే కేజ్రీవాల్ రాజకీయ జీవితానికి మరింత అవినీతి కాలుష్యం అంటినట్టే.