eknadh-shinde-devendra-fadnavis

మహారాష్ట్రలో ఒకప్పుడు శివసేన, బీజేపి మిత్ర పక్షాలుగా, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండేవి. అయితే ముఖ్యమంత్రి పదవి విషయంలో వాటి మద్య బేధాభిప్రాయలు రావడంతో విడిపోయాయి. అంతవరకే అయితే అది ప్రజాస్వామ్యంలో చాలా సహజమే అని సరిపెట్టుకోవచ్చు.

కానీ ఆ తర్వాత బీజేపి చక్రం తిప్పి శివసేనలో కట్టప్ప ఏక్ నాధ్ షిండేని ప్రోత్సహించి ఆ పార్టీని నిలువునా చీల్చి, ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేజిక్కించుకుంది. అందుకు కృతజ్ఞతగా ఏక్ నాధ్ షిండేని ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ చక్రం తిప్పడం ప్రారంభించింది.

Also Read – బీజేపి విజయంలో చంద్రబాబు… కొందరికి ఎసిడిటీ తప్పదు!

మహారాష్ట్రలో బలమైన ప్రతిపక్షపార్టీగా ఉన్న శివసేన చీలిపోవడంతో బలహీనపడగా, కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాయి. కనుక మళ్ళీ షిండే శివసేన-బీజేపి ఎన్నికలలో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి.

ఈసారి ఎన్నికలలో బీజేపి 132 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ముఖ్యమంత్రి పదవి తమకే దక్కాలని భావిస్తోంది. అంటే ఇదివరకు శివసేనతో ఏర్పడిన సమస్యే మళ్ళీ షిండే-శివసేనతో ఏర్పడిందన్న మాట!

Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!

అయితే బీజేపితో పంతాలు, పట్టింపులకుపోతే ఏమవుతుందో తెలుసు కనుక ముఖ్యమంత్రి పదవి విషయంలో వెనక్కి తగ్గేందుకు సిద్దపడిన్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో బీజేపి అమలుచేసిన ఈ ఫార్ములాని రేపు ఏదో రోజు ఏపీలో అమలుచేయకుండా ఉంటుందని అనుకోలేము. అయితే ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మద్దతు చాలా కీలకం కనుక ఇప్పటికిప్పుడు అటువంటి ఆలోచనలు చేయకపోవచ్చు కానీ భవిష్యత్‌లో ఏదో రోజు తప్పక చేయవచ్చు.

Also Read – వివేకా హత్యతో సంబందం లేకపోతే భయం దేనికి?

రాజకీయాలలో శాశ్విత మిత్రులు, శత్రువులు ఉండరు. కనుక ఇప్పుడు మిత్రులుగా ఉన్న టిడిపి, జనసేన, బీజేపీలు ఎప్పటికీ మిత్రులుగానే ఉంటాయని, ఎప్పటికీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే పనిచేస్తాయని అనుకోలేము.




2014లో కలిసున్న టీడీపీ, జనసేన, బీజేపిలు 2019 లో విడిపోయాయి. మళ్ళీ 2024 లో కలిశాయి. కనుక అటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదురయ్యే అవకాశం ఉండవచ్చు. కనుక టీడీపీ అటువంటి పరిస్థితులకు ముందే తగిన ప్రణాళికలు, వ్యూహాలు సిద్దం చేసుకుంటే మంచిదేమో?