Boat Races Competition Held In Athreyapuram Canal

ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రంలో అటు తిరుపతి, నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అనేక పర్యాటక ఆకర్షణ కేంద్రాలున్నాయి. సువిశాలమైన సముద్రతీరం ఉంది. కృష్ణ, గోదావరి తదితర నదులున్నాయి. పచ్చటి కోనసీమ ఉంది. ప్రకృతి రమణీయమైన అరకు ఉంది. ఆంధ్రాలో పుణ్యక్షేత్రాల గురించి అందరికీ తెలిసిందే. కనుక ఆంధ్రాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉంది.

ప్రపంచంలో కొన్ని దేశాలు, మన దేశంలో కశ్మీర్‌, గోవా వంటి కొన్ని ప్రాంతాలు పర్యాటక రంగంతోనే గుర్తింపు పొంది, వాటి ఆదాయంతోనే మనుగడ సాగిస్తున్నాయి.

Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!

కానీ పర్యాటకశాఖ అంటే ప్రభుత్వాలకు, మంత్రులకు చిన్న చూపు ఉండటంతో దానికి దక్కాల్సిన ప్రాధాన్యత, గుర్తింపు ఇంతవరకు దక్కలేదు.

కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ఓ పరిశ్రమగా గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయించడం చాలా శుభ పరిణామమే.

Also Read – విలువలు, విశ్వసనీయత పోటీలు: రేసులో ఇద్దరే

కేరళలో ఏటా ఓనం పండుగ సందర్భంగా పడవ పందేలు జరుగుతుంటాయి. వాటిని చూసేందుకు దేశవిదేశాల నుంచి వేలాదిమంది పర్యాటకులు తరలివస్తుంటారు.

అదే స్పూర్తితో సంక్రాంతి పండుగ సందర్భంగా డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురంలో ప్రధాన పంట కాలువలో పడవ పందేలు నిర్వహించారు. వాటితో పాటు ఈత పోటీలు కూడా నిర్వహించారు. ఈ పోటీలలో పర్యాటక శాఖకు చెందిన సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Also Read – అల్లు వారి ఇంట మెగా వివాదాలు…!

ఈ పోటీల గురించి పెద్దగా ప్రచారం చేయనప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనాలు తరలివచ్చి ఆనందించారు. అదే.. ముందుగా వీటి గురించి ప్రచారం చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగలవారిని పోటీలలో పాల్గొనాలని ఆహ్వానించి, పోటీలు జరిగే చోట పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు, చుట్టు పక్కల ప్రాంతాలలో పర్యటించేందుకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించి ఉండి ఉంటే ఇదో అతిపెద్ద ఈవెంట్‌గా మారి ఉండేది కదా?

ఆత్రేయపురంలో మొదలుపెట్టిన ఈ పోటీల స్పూర్తితో రాష్ట్రంలో ఈ వెసులుబాటున్న మిగిలిన జిల్లాలో కూడా ఇటువంటి పోటీలు నిర్వహించవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులతో పాటు కేరళలో మాదిరిగా వెసులుబాటు ఉన్న ప్రాంతాలలో లాంచీలతో ఏపీఎస్ వాటర్ ట్రాన్స్‌పోర్టు సర్వీసు కూడా ప్రారంభించవచ్చు.




పర్యాటక శాఖ బోట్ హౌస్‌లు, బోట్ రైడ్స్, స్పీడ్ బోట్స్ వంటివి ఏర్పాటు చేయవచ్చు. ఈ మాత్రం చేస్తే పర్యాటకులు పెరుగుతారు. అప్పుడు పర్యాటక రంగం నుంచి ప్రభుత్వానికి ఆదాయం, స్థానికులకు ఉపాధి లభిస్తుంది కదా?