
వైసీపీ క్రిమినల్ రికార్డ్స్ చూస్తున్నప్పుడు, ఒకే పార్టీలో ఇంతమంది మైండ్ సెట్ ఓకేలా ఎలా ఉంది? ఇదేమీ పార్టీ సిద్దాంతమో, విధానమో కాదు కదా? కానీ పార్టీ ఇంచుమించు అందరి ట్రాక్ రికార్డ్స్ ఒక్కలాగే ఉన్నాయేమిటి? అని ఆశ్చర్యం కలుగుతుంది.
అక్రమాస్తుల కేసులతోనే జగన్, విజయసాయి రెడ్డి వైసీపీకి ‘కవర్ పేజ్’ క్రియేట్ చేశారు. బహుశః అది చూసి అట్రాక్ట్ అయిన అటువంటి లక్షణాలు లేదా ఆలోచనలున్నవారందరూ వైసీపీ గొడుగు కింద చేరారేమో?
Also Read – జగన్ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!
ఇంతకీ విషయం ఏమిటంటే, రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్, బెయిల్ కోసం తన తల్లి తీవ్ర అనారోగ్యంగా ఉందంటూ తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి హైకోర్టుకి సమర్పించి బయటకు వచ్చాడు. తప్పుడు సర్టిఫికెట్‌తో హైకోర్టుని కూడా నమ్మించి బెయిల్ సంపాదించవచ్చని గ్రహించడంతో, ఈ నెల 1న మరోసారి ప్రయత్నించి బెయిల్‌పై బయటకు వచ్చాడు.
కానీ పోలీసులకు అనుమానం కలిగి దర్యాప్తు చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం మార్చి 11 వరకు బెయిల్ లభించింది కనుక బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడున్నాడో తెలీదు. పోలీసులు ఫోన్ చేస్తుంటే స్విచ్చాఫ్ వస్తోంది.
Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?
అంటే తల్లికి అనారోగ్యం సాకుతో నేర్పుగా కోర్టు అనుమతితోనే జైలు నుంచి బయటకు వచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా? తెలియాల్సి ఉంది.
సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం గురించి జగన్‌తో సహా వైసీపీ నేతలు రోజూ చాలా మాట్లాడుతుంటారు. కానీ ఈ బోరుగడ్డ వ్యవహారం బయటపడిన తర్వాత కూడా ఎవరూ మాట్లాడటం లేదు!
Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!
వివేకాని వేసేసి గుండెపోటన్నారు. దళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టుకే టోపీ వేసి తప్పించుకు పారిపోయాడు. ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలన్నీ వైసీపీలకే ఎలా వస్తాయో?