Botsa Satyanarayana Bravely Facing Alliance Govt Members

శాసనమండలిలో వైసీపీ అంటే బొత్స సత్యనారాయణ ఒక్కరే అని భావించవచ్చు. మరోపక్క కూటమిలో మూడు పార్టీల సభ్యులున్నారు. వారందరినీ బొత్స సత్యనారాయణ ఒక్కరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.

అచ్చనాయుడు వంటి సీనియర్ నేతలు ఎంత ధాటిగా వాదిస్తున్నప్పటికీ, బొత్స సత్యనారాయణ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వారందరికీ ఆయన ఒక్కరే ధీటుగా జవాబులు చెపుతూ, నవ్వుతూనే మద్య మద్యలో చురకలు వేస్తున్నారు కూడా.

Also Read – అవినీతిని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటున్నారుగా!

ఈరోజు మండలిలో జరిగిన చర్చలో ఆయన అప్పులు, పధకాలు, హామీలు, ప్రాజెక్టులు ఇలా ప్రతీ విషయంపై చాలా సాధికారికంగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు.

అధికార పార్టీ సభ్యులను ఎదుర్కొనేటప్పుడు ఏమాత్రం తడబడకుండా హాయిగా నవ్వుతూ, చాలా సరదాగానే మాట్లాడారు.

Also Read – హాజరు కోసమే కేసీఆర్‌ వచ్చారట!

“ఈ విధ్వంసం అనే మాట ఎలా పుట్టిందో కానీ మీరందరూ దానిని రోజూ ఎడాపెడా వాడేస్తూనే ఉన్నారని” బొత్స నవ్వుతూ చురకలు వేశారు.

“కూటమి ప్రభుత్వం ఇంతవరకు చేసిన పనులు చెప్పమంటే రాబోయే 5 ఏళ్ళు, 30 ఏళ్ళలో చేయబోయేవాటి గురించి మాట్లాడుతున్నారు. చేయని పనులు చేసిన్నట్లు గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నారు?పైగా వాటి గురించి బడ్జెట్‌లో వ్రాసుకోవడం దేనికి?” అని చురకలు వేశారు.

Also Read – మంచి ప్రశ్న వేశారు మద్యలో ఆవు కధ దేనికి భూమనగారు?

ఆయన మాట్లాడుతున్నప్పుడు మద్యలో అధికార పార్టీ సభ్యులు అడ్డుపడుతుండటంతో, “ఇవన్నీ ఎందుకు? మాట్లాడింది చాలు. మాట్లాడకుండా కూర్చోండి.. అని ఒక్క మాట చెప్పండి కూర్చుంటాను. నన్ను కూర్చోమంటారా.. మాట్లాడమంటారా?మీరే చెప్పండి అని బొత్స సత్యనారాయణ అడిగేసరికి అందరూ హాయిగా నవ్వుకున్నారు.

బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు, విసిరిన సవాళ్ళకు మంత్రి అచ్చన్నాయుడు చాలా ధీటుగా బదులిచ్చారు.

“మా విజయనగరం, మీ శ్రీకాకుళం జిల్లాలలోనే గుంతలు పడిన రోడ్లకు ఇంకా పూడ్చలేకపోయారని” బొత్స సత్యనారాయణ వ్యంగ్యంగా అంటే, “అయితే మరెందుకు ఆలస్యం? మీరే చెప్పండి. ఏ జిల్లాలో ఏ ఊర్లో ఏ రోడ్లు గుంతలు పడి ఉన్నాయో వెళ్ళి చూసొద్దాము,” అని మంత్రి అచ్చన్నాయుడు బదులిచ్చారు.

ఎన్నికల సమయంలో జగన్‌ నేను అర్జునుడిని, సింగిల్ సింహాన్ని అంటూ చాలా గొప్పలు చెప్పుకున్నారు. కానీ శాసనసభకు వచ్చేందుకు భయపడుతున్నారు.

బొత్స సత్యనారాయణ అలా గొప్పలు చెప్పుకోలేదు. కానీ మండలిలో సింగిల్ సింహంలా కూటమి సభ్యులతో ధైర్యంగా పోరాడుతున్నారు. అంటే జగన్‌ కంటే బొత్స సత్యనారాయణ చాలా మేలన్నమాట!

మండలిలో వైసీపీ-కూటమి సభ్యుల మద్య ఈవిదంగా జరుగుతున్న చర్చలను చూస్తున్నప్పుడు, ఒకవేళ జగన్‌ కూడా ధైర్యం చేసి శాసనసభకు వచ్చినా ఏమీ ప్రమాదం ఉండదని స్పష్టమవుతోంది కదా?




కానీ బొత్స సత్యనారాయణ పాటి ధైర్యం కూడా లేని జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్లు పెడుతూ, అదే శాసనసభ, అదే మండలి అని అనుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు పాపం!