Jagan Botsa

జగన్‌ ఎప్పుడూ ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనే ప్రయత్నించి భంగపడుతుంటారు. ఢిల్లీలో ధర్నా కూడా అటువంటి ప్రయత్నమే.

సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టిడిపి కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం, శాసనసభ సమావేశాలకు హాజరవకుండా తప్పించుకోవడం పైకి కనిపిస్తున్న రెండు కారణాలు.

Also Read – వైసీపీలో టాప్ టూ బాటమ్ అందరూ ఇంతేనా?

కానీ కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరేడు నెలలు సమయం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలన్నర రోజులకే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్‌ ఢిల్లీలో ధర్నా చేయాలనుకోవడం చాలా తొందరపాటే, వ్యూహాత్మక తప్పిదమే అనిపిస్తుంది.

కానీ ధర్నా పేరుతో ఢిల్లీలో మకాం వేసి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి తన పాత కేసులతో పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టబోయే కొత్త కేసుల నుంచి కాపాడమని బ్రతిమాలుకోవడానికే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read – జగన్‌వి శవరాజకీయాలట .. ఎంత మాటనేశారు నారాయణా?

ఇప్పటికే ఓ పోలీస్ కేసు నమోదవడంతో పోలీసులు తనని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే భయం, ఆందోళనతోనే జగన్‌ ధర్నా పేరుతో ఢిల్లీలో లాబీయింగ్‌కు ప్రయత్నిస్తున్నట్లున్నారు. బహుశః అందుకే విజయసాయి రెడ్డి ముందుగానే ఢిల్లీ వెళ్ళి నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి మాట్లాడారు కూడా.

కానీ ఆనాడు తాను చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెడితే స్పందించని కేంద్రం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మద్దతుపై ఆధారపడి ఉన్న మోడీ ప్రభుత్వం తనను కాపాడుతుందనుకోవడం అత్యాశేగా?

Also Read – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మూడు స్తంభాలాటేనా.?

మరో కొత్త విషయం ఏమిటంటే వీలైతే కాంగ్రెస్‌ అధిష్టానంతో బేరసారాలు చేసుకోవాలని జగన్‌ ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

జగన్‌ బెంగళూరులో ఉన్నప్పుడే దీని గురించి ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌తో చర్చించిన్నట్లు వార్తలు వచ్చాయి. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలని ఆ పదవి నుంచి తొలగించి, తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే వైసీపిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని అప్పుడే ఆఫర్ ఇచ్చిన్నట్లు వార్తలు వచ్చాయి.

తద్వారా పక్కలో బల్లెంలా మారిన వైఎస్ షర్మిలని వదిలించుకోవడమే కాక, ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీ ‘రక్షణ కవచం’ కూడా లభిస్తుందని జగన్‌ ఆశపడుతుండవచ్చు. జగన్తో పోలిస్తే షర్మిల వలన ఏపీ కాంగ్రెస్‌కు పెద్దగా ప్రయోజనం ఉండదు.

కనుక కాంగ్రెస్‌ అధిష్టానం కూడా జగన్‌తో టచ్చులోకి వచ్చిన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బహుశః అందుకే కాంగ్రెస్‌ అధిష్టానంతో మంచి పరిచయం ఉన్న బొత్స సత్యనారాయణని జగన్‌ వెంట బెట్టుకొనివెళ్ళి ఉండవచ్చు. ఆయన రాయబారం చేస్తారేమో?

ఒకవేళ కాంగ్రెస్‌ అధిష్టానం జగన్‌తో చేతులు కలిపితే, ఆమె పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది. వైఎస్ షర్మిల కూడా ఇది పసిగట్టినందునే జగన్‌పై ఆ స్థాయిలో విరుచుకుపడి ఉండవచ్చు.