కొన్ని కేసులలో వాదించేందుకు బలమైన పాయింట్ ఏమీ లేనప్పుడు లేదా ఆ కేసులో నిందితుడు తప్పు చేశాడనే స్పష్టమైన సాక్ష్యాధారాలున్నప్పుడు, ముద్దాయి తరపు వాదిస్తున్న న్యాయవాది ‘ఈ కేసుకి ఫలనా సెక్షన్స్ వర్తించవు’ అంటూ కొండకు వెంట్రుక మూడేసి లాగే ప్రయత్నం చేస్తుంటారు. పోసాని కేసు తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలే ఇందుకు తాజా ఉదాహరణ.
ఇదేవిదంగా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బలమైన పాయింట్ ఏమీ లేనప్పుడు, దానిని వేరే అంశంతో ముడిపెట్టి ‘ఆవు కధ’లా సాగదీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటాయి.
ఆంధ్రాలో విశ్వవిద్యాలయాలకు కూటమి ప్రభుత్వం కొత్త వైస్- ఛాన్సిలర్స్ నియామకం విషయంలో కూడా వైసీపీ ఇదే పద్దతి అవలంభిస్తోంది. తమ హయాంలో నియమించిన వైస్- ఛాన్సిలర్లను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బెదిరించి భయపెట్టి వారి చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాదిస్తోంది.
ఇటువంటి రాజకీయ నియామకాల ద్వారా పదవులు పొందినవారు ప్రభుత్వం మరగానే తమ కొత్త ప్రభుత్వం తనకు నచ్చినవారిని నియమించుకోవడానికి స్వచ్ఛందంగా పదవులకు రాజీనామాలు చేస్తుంటారు. ఆంధ్రాలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే జరిగింది.
ఈ సందర్భంగా తాను వైస్-ఛాన్సిలర్లను బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించాననే బొత్స సత్యనారాయణ ఆరోపణలకు ఘాటుగా జవాబిస్తూ, “మీ వైసీపీ నేతల బంధువులతో యూనివర్సిటీలను నింపేశారు. కనుక వారందరూ యూనివర్సిటీలను రాజకీయ కార్యాలయాలలా మార్చేశారు.
జగన్ బంధువు ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్-ఛాన్సిలర్ ప్రసాద్ రెడ్డి యూనివర్సిటీలో జగన్ పుట్టినరోజు వేడుకలు జరిపారు కదా?మీ హయాంలో నియమించిన వైస్-ఛాన్సిలర్ల గురించి చెప్పుకోవాలంటే సమయం సరిపోదు.
వారు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసిన తర్వాతే మా ప్రభుత్వం వారి స్థానాలలో ప్రతిభ, అనుభవం ఆధారంగా కొత్తవారిని నియమించింది.
రాష్ట్రంలో యూనివర్సిటీలకు ప్రతిభ ఆధారంగా వైస్-ఛాన్సిలర్లను నియమించడం ఇదే తొలిసారి. ఈ పదవులకు దేశవిదేశాలకు చెందిన 500 మంది మేధావులు దరఖాస్తు చేసుకున్నారని, ఈ పదవులకు ఈ విదంగా ఇంతమంది పోటీ పడటం కూడా ఇదే మొదటిసారి,” అని మంత్రి నారా లోకేష్ నేడు మరోసారి చెప్పారు.
జగన్ హయాంలో మంత్రి పదవి ఆశించిన బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ ఇచ్చినప్పుడు ఆయన అయిష్టంగానే దానిని స్వీకరించగా, కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ కావాలని అడిగి తీసుకున్న వ్యక్తి నారా లోకేష్. కనుక ఓ మాజీ, తాజా విద్యాశాఖ మంత్రుల మాటలు, పనితీరు ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు.
పాఠశాల స్థాయి విద్యావిషయాల గురించి మాట్లాడేందుకే తడబడే బొత్స సత్యనారాయణ, మండలిలో యూనివర్సిటీ వైస్-ఛాన్సిలర్ల గురించి మాట్లాడి నవ్వులపాలయ్యారు కదా? ఆయన అనుభవం పాటి వయసు కూడా లేని నారా లోకేష్ చెప్పిన సమాధానం చాలా బాగుంది.
నారా లోకేష్ X బొత్స సత్యనారాయణ
అంత సీనియర్ నాయకుడు లోకేష్ మాట్లాడుతుంటే మధ్యలో కంగారు పడి Interrupt చెయ్యడం ఏంటో!#NaraLokesh pic.twitter.com/4YIaGoMG4q
— M9 NEWS (@M9News_) March 4, 2025




