బోయపాటి-రాంచరణ్ వినయ విధేయ రామ డిజాస్టర్ అని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే ఒక మాస్ హీరోతో ఒక మాస్ డైరెక్టర్ జత కట్టడంతో భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది ఈ సినిమా. అయితే ఈ సినిమా ఫలితం తేడా కొట్టడంతో మెగా ఫాన్స్ నిరుత్సాహంతో కూరుకుపోగా, నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దానికి గల కారణాలు లేకపోలేదు.
గత కొన్ని రోజులుగా ఎన్ఠీఆర్ బయోపిక్ పై మెగా ఫాన్స్ చేసిన విష ప్రచారానికి ప్రతిగానే నందమూరి ఫాన్స్ ఆ స్టెప్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ రెండు వర్గాల మధ్య ఈ రభస ఎప్పుడూ ఉండేదే అనుకోండి. అయితే ఇక్కడ అసలు లాజిక్ ఏంటి అంటే, చెర్రీ సినిమా పోయింది కాబట్టి నందమూరి ఫాన్స్ ఇప్పటికి ఫుల్ హ్యాపీ, కానీ బోయపాటి తన తర్వాత సినిమా బాలయ్యతోనే తీస్తున్నాడు. మరి దాని సంగతి ఏంటి? అయితే ఇదే ఆలోచనతో బాలయ్య అభిమానులు నలిగిపోతున్నారు.
ఒక పక్క చెర్రీ సినిమా ఫ్లాప్ ఎంత ఆనందాన్ని ఇస్తుందో, మరో పక్క బాలయ్య తర్వాత సినిమా విషయంలో టెన్షన్ మొదలయ్యింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, ఈ సినిమా బాలయ్య సొంత బ్యానర్ లో రావడమే. మరి ఏమాత్రం తేడా కొట్టినా మెగా ఫాన్స్ ట్రోలింగ్ కి దొరికిపోక తప్పుడు నందమూరి అభిమానులు. చూద్దాం మరి బోయపాటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో.



