హైదరాబాద్ ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది హైడ్రా. ఆదివారం సెలవు రోజున అందరూ రిలాక్స్ అవుతుంటారు. కానీ ఆదివారం వస్తే చాలు హైడ్రా జేసీబీలు తమ ఇళ్ళని కూలచేస్తాయేమో అని అందరూ భయపడే పరిస్థితి నెలకొంది.
కానీ రాజకీయ ఒత్తిళ్ళు, న్యాయస్థానాల మొట్టికాయలు, ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా విమర్శలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టకేలకు హైడ్రాకి బ్రేకులు వేయక తప్పలేదు.
Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!
హైడ్రా కమీషనర్ రంగనాధ్ ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వ ఆదేశం మేరకు ఇక నుంచి హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన ఇళ్ళ జోలికి వెళ్ళబోము. అవి అన్ని అనుమతులు తీసుకుని నిర్మించినవైనా కానీవైనా సరే. కనుక ఆ ఇళ్ళను కూల్చివేస్తామని పుకార్లు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
కానీ ఇకపై కొత్తగా నిర్మించే ఇళ్ళు, భవనాలు అన్నీ తప్పనిసరిగా నిబంధనలకు లోబడి ఉండాలి. విరుద్దంగా బఫర్ జోన్ పరిధిలో నిర్మిస్తున్నట్లయితే తప్పకుండా వాటిని కూల్చేస్తాం.
Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!
లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రభుత్వానికి హైడ్రా ఏర్పాటు చేయగానే వందల ఇళ్ళని కూల్చివేసింది. కానీ ఇకపై కూల్చబోమని చెప్పడం చాలా సంతోషమే. కానీ తద్వారా ఇంతవరకు చేసింది తప్పే అని ఒప్పుకున్నట్లే కదా? హైడ్రా ఇప్పటికే వేలాదిమంది పేదల ఇళ్ళని కూల్చేసి వారందరినీ రోడ్డున పడేసింది. వారి జీవనాధారామైన టిఫిన్ సెంటర్స్, కూరగాయల దుకాణాలు వంటివాటిని కూడా హైడ్రా కూల్చేయడంతో వారు రోడ్డున పడి అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు. మరి వారందరికీ కలిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ప్రభుత్వమా హైడ్రా?
ఈ తాజా నిర్ణయం ఎవరి కోసం? సామాన్య ప్రజల కోసమేనా అంటే కాదనే చెపొచ్చు. అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు హైదరాబాద్ నగరంలో హైడ్రా నిబందనలకు విరుద్దంగా భారీ అపార్ట్‌మెంట్లు, పెద్ద పెద్ద కాలేజీ భవనాలు నిర్మించుకున్నారు. వాటినీ కూలచేస్తామని హైడ్రా కమీషనర్ రంగనాధ్ ఇదివరకు చెప్పారు. కానీ ఇప్పుడు హైడ్రా ఏర్పాటుకి ముందు కట్టినవాటి జోలికి పోమని చెప్పడం అంటే పెద్దల ఇళ్ళు, కాలేజీల జోలికి పోమని చెపుతున్నట్లే! అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పేదల మీద తమ ప్రతాపం చూపించి, రాజకీయ ఒత్తిళ్ళు వచ్చేసరికి హైడ్రాకు బ్రేకులు వేసిందన్న మాట!