BRS Chief KCR Started Second Innings

ఊహించిన్నట్లే కేసీఆర్‌ నిన్న జరిగిన బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తన పాలన అద్భుతంగా ఉందని, రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్‌, బీజేపిలకు చెరో 8 మంది ఎంపీలను ఇస్తే ఏం పీకుతున్నారు?అని ప్రశ్నించారు.

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే రాజీనామాలు చేయక తప్పదని, ఉప ఎన్నికలొస్తాయని, వాటిలో మనమే గెలుస్తామని కేసీఆర్‌ జోస్యం చెప్పారు. ఆ విజయంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలవుతుందని చెప్పారు. కనుక ఉప ఎన్నికలకు అందరూ సిద్దంగా ఉండాలని కేసీఆర్‌ చెప్పేశారు.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

అయితే పార్టీ ఎంతగా బలహీనపడినప్పటికీ, కొడుకు కేటీఆర్‌ ఎఫ్-1 రేసింగ్ కేసులో అరెస్ట్‌ అయ్యే ప్రమాదం ఉందని తెలిసి ఉన్నప్పటికీ, శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సిఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ దాదాపు ఏడాదిగా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాలేదు.

కనుక ఇలాంటి చిలక జోస్యం చెప్పేముందు ఇంతకాలం తాను ఫామ్‌హౌస్‌లో నుంచి ఎందుకు బయటకు రాలేదో పార్టీ శ్రేణులకు సంజాయిషీ ఇచ్చుకోవాలి. పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ పార్టీ పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు ముందుగా అందరికీ క్షమాపణ చెప్పుకోవాలి. కానీ ఎప్పటిలాగే సొంత డప్పు కొట్టుకొని ప్రగల్భాలు పలికి చిలక జోస్యం చెప్పి చప్పట్లు కొట్టించుకున్నారు.

Also Read – వైసీపీ ‘గొంతు’నొక్కేస్తే…కూటమి ‘కళ్ళు’ మూసుకుందా.?

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో కేసు వేసినంత మాత్రాన్న వారు రాజీనామాలు చేసేయరు. ఉప ఎన్నికలు వచ్చేయవు.. వచ్చినా బిఆర్ఎస్ పార్టీ గెలిచేయదని ఆ పార్టీ నేతలందరికీ కూడా తెలుసు.

కానీ ‘175కి 175 మనవే..’ అంటూ జగన్‌ ఏవిదంగా వైసీపీ నేతల కళ్ళకు గంతలు కట్టి గోతిలో పడేశారో అదేవిదంగా కేసీఆర్‌ కూడా బిఆర్ఎస్ పార్టీ నేతల కళ్ళకు గంతలు కట్టి నడిపిస్తున్నారనిపిస్తుంది.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

కేసీఆర్‌ ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో సహా కేటీఆర్‌, హరీష్ రావు, కల్వకుంట్ల కవితలు ప్రతీరోజూ ప్రధాని మోడీని, బీజేపిని విమర్శించేవారు. కానీ నిన్న సుమారు 2 గంటలసేపు రాష్ట్ర రాజకీయాల గురించి అనర్గళంగా ప్రసంగించిన కేసీఆర్‌, ప్రధాని మోడీ, బీజేపి ప్రస్తావన చేయలేదు. అంటే బీజేపితో సర్దుకుపోయేందుకు కేసీఆర్‌ సిద్దపడుతున్నారా?

కానీ ఈ సమావేశంలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవడం, దాని కోసం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియని మొదలుపెట్టడం, ప్లీనరీ సభ, దానికి ఏర్పాట్లు వంటి పార్టీకి సంబందించిన అంశాలపై కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.




కనుక కేసీఆర్‌ దాదాపు ఏడాది అజ్ఞాతవాసం తర్వాత మొదలుపెట్టిన ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ బాగానే మొదలుపెట్టారని చెప్పొచ్చు.