‘తోడు’ దొంగలాట…టీడీపీ అడ్డుకట్ట వేయలేదా.?

BRS Jagadish Reddy

ఇన్నాళ్లుగా ఫామ్ హౌస్ రాజకీయాలతో స్తబ్దుగా ఉన్న బిఆర్ఎస్, ప్యాలస్ రాజకీయాలతో సద్దుమణిగిన వైసీపీ ఒక్కసారిగా తమ జూలు విదిలిస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీల అథినేతలు ఒకరి కోసం ఒకరు తెరవెనుక రాజకీయాలు నడపడంలో ఆరితేరిపోయారు.

వీరిద్దరి ఉమ్మడి శత్రువు అయిన టీడీపీ అథినేత నారా చంద్రబాబు నాయుడు గెలుపుని జీర్ణించుకోలేని ఈ రెండు పార్టీలు కూడా టీడీపీ ఓటమి కోసం రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ చిచ్చు రేపడానికి సిద్ధమయ్యారనిపిస్తుంది. దీనికి వీరి వద్ద ఉన్న ఒకేఒక అంశం రాష్ట్ర విభజన అంశాలు, నది జలాల వివాదాలు.

ADVERTISEMENT

అయితే ఈ సారి కూడా అదే అస్త్రంతో బిఆర్ఎస్ టీడీపీ పార్టీ మీద, ఏపీ సీఎం బాబు మీద నోరుపారేసుకోవడం మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను అక్రమంగా ఏపీ కి తరలిస్తున్నారంటూ రాజకీయం మొదలుపెట్టారు.

బిఆర్ఎస్ వేసిన రాజకీయ ఉచ్చులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిక్కుకుపోయింది. తమ రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్, బాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారంటూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు బిఆర్ఎస్ నేతలు. దీనితో కాంగ్రెస్ సైతం ఏపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పింస్తుంది.

అయితే ఈ సాకును అడ్డుపెట్టుకుని మీడియా ముందుకొచ్చిన బిఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి బాబు పై హద్దుదాటి విమర్శలకు దిగారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లల్లో బాబుని తెలంగాణలో అడుగు కూడా పెట్టనివ్వలేదు, అలాగే ఒకసారి పెట్టడానికి ప్రయత్నిస్తే ‘రాష్ట్రం నుండి తన్ని తరిమేశాం’ అంటూ సున్నితమైన అంశం మీద రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు తమ పార్టీ స్వార్ధ ప్రయోజనాల కోసం ఒకరు బాబుకి మోకరిల్లుతున్నారు, మరొకరు మోడీకి తలొగ్గుతున్నారు అంటూ బాబు మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నేతలకు టీడీపీ సరైన కౌంటర్ ఇవ్వలేకపోతుంది. రెండు రాష్ట్రాలను రెండు కళ్ళుగా భావించి మౌనంగా ఉన్న బాబు సున్నితత్వాన్ని బిఆర్ఎస్ చేతకాని తనంగా భావిస్తుంది.

టీడీపీ మౌనం బిఆర్ఎస్ కి బలంగా మారుతుంది. ఆ బలమే ఈ బరితెగింపుకి ఊతమిస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మరో రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేత తన్ని తరిమేశాం అంటూ కించపరిచి మాట్లాడుతున్నారు అంటే టీడీపీ బిఆర్ఎస్ పార్టీకి ఎంతగా చులకనయ్యింది అర్ధమవుతుంది.

గతంలో మాదిరి తెలంగాణలో టీడీపీ చురుకైన రాజకీయాలు చేయడం లేదు. ఒకరకంగా చూస్తే తెలంగాణలో టీడీపీ పార్టీ కి మద్దతుదారులు ఉన్నారు కానీ ఆ పార్టీకి ఓటర్లు లేరు అనేది వాస్తవం. అయినా కూడా బిఆర్ఎస్ తమ రాజకీయ ప్రత్యర్థిగా టీడీపీ ని భావించడం, బాబు పై విమర్శలు చేయడం వెనుక దాగి ఉన్న ఆ రాజకీయ మర్మమేమిటో అందరికి ఎరుకే.

అయితే టీడీపీ మాత్రం వారిని అడ్డుకోలేకపోతుంది. అలాగే ఇటు పక్క ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ అదే దూకుడుతో బాబు మీద రెచ్చిపోతుంది. ఓటమి ఇచ్చిన గుణపాఠం కూడా చెవికెక్కని జగన్ అదే చెత్త రాజకీయాలతో ఏపీ భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు. అటు బిఆర్ఎస్ తో చేతులు కలిపి రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ చిచ్చు రేపెడుతున్నారు, ఇటు వైసీపీ నోటికి కళ్లెం వేయకుండా సొంత రాష్ట్ర వింశాన్నయికి పాల్పడుతున్నారు.

ఇకనైనా చంద్రబాబు ఈ తోడుదొంగలాట కు చెక్ పెట్టలేకపోతే తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవానికి అర్ధం లేనట్టే అవుతుంది. ఒక వ్వక్తి విజయాన్ని తట్టుకోలేక, ఒక పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ఇద్దరు వ్యక్తులు కలిసి ఆడుతున్న ఈ రాజకీయం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్నా ఇంకా టీడీపీ మౌనాన్ని ఒప్పుకోలేకపోతున్నారు ఏపీ ప్రజలు. గతంలో మాదిరి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాకుండా చేతులు కాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories