BRS Leader Srinivas Goud Political Comments AT Tirumala

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటూ రెండుగా విడగొట్టబడిన తెలుగు రాష్ట్రాల మధ్య ‘రాజకీయం’ మాత్రం ఇంకా అంటిపెట్టుకునే ఉందా అనిపిస్తుంది.? తెలంగాణ రాజకీయ పార్టీలు వాటి రాజకీయ అవసరాల కొరకో, ఏపీలో వారి అమాత్యుల ఆనందం కోసమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం కక్కుతూనే ఉంటున్నారు.

గత పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ పెద్దలు ఏపీ రాజకీయాలలో వేలు పెట్టి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర రాజధానిని అవమానిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లోని జగన్ గారి శ్రోయోభిలాషి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిని ముంపు ప్రాంతం అంటూ అభివర్ణించి అమరావతి మీద ఉన్న ద్వేషాన్ని బయటపెట్టారు.

Also Read – ఎఫ్-1 కేసులో… జై తెలంగాణ దేనికి?

ఇక ఇప్పుడు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఏపీ బ్రాండ్ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు. అసలు తిరుమలేశుడి కొండ మీద రాజకీయాలు మాట్లాడడమే నిషిద్ధం అన్న నిబంధనను తుంగలోకి తొక్కి రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసారు సదరు బిఆర్ఎస్ నేత.

తిరుమల కొండ మీద తెలంగాణ వ్యాపారులకు, తెలంగాణ రాజకీయ నాయకులు అనాయ్యం జరుగుతుందని, వీరి పట్ల టీటీడీ భేదభావం చూపుతుందని అసందర్భ వ్యాఖ్యలు చేసి లేనిపోని రాజకీయానికి తెరలేపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటికీ అక్కడ తెలంగాణలో బాగుపడింది కూడా ఆంద్రావాళ్లే అంటూ మరోసారి ఆంధ్ర ప్రజల మీద కూడా తమకున్న ఉక్రోషాన్ని బయట పెట్టుకున్నారు శ్రీనివాస్ గౌడ్.

Also Read – షా తో బాబు ‘విందు’ మంతనాలు..?

నిజంగా శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం లో తెలంగాణ ఆంధ్రా అనే బేధభావాలు చూపించాలి అనుకుంటే ఇప్పుడు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే భుజం మీద టీటీడీ దేవస్థానం వారు మర్యాదపూర్వకంగా కప్పే శ్రీవారి శాలువా ఉంటుందా.?

నిజంగా ఆయన ఆరోపణలు చేసినట్లు టీటీడీ అటువంటి విద్వేషాలు రెచ్చకొట్టే చర్యలకు పాల్పడి ఉంటే టీటీడీ కమిటీ లో తెలంగాణ కోట నుంచి నాయకులను కమిటీ సభ్యులుగా ఎంచుకునే వారేనా.? అసలు దేవుని దర్శనానికి వచ్చిన వ్యక్తి శ్రీవారి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడడం ఎంత వరకు సమంజసం.?

Also Read – టిడిపికి కోటి దండాలు.. సభ్యత్వాలు!

టీటీడీ ఇటువంటి వారి మీద కఠినంగా వ్యవహరించి తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని కోరుకుంటున్నారు శ్రీవారి భక్తులు. అలాగే తెలంగాణ నాయకులు ముఖ్యంగా బిఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా ఆంధ్రా, ఆంద్రోళ్ళు అంటూ పక్క రాష్ట్రాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి.




తిరుమల మీద హక్కుల గురించి ప్రస్తావించిన ఈ పెద్ద మనిషి తిరుమల పవిత్రను దెబ్బ తీసేలా శ్రీవారి లడ్డు ప్రసాదం చెలరేగిన దుమారం మీద వైసీపీ నాయకులను ఎందుకు ప్రశ్నించలేకపోయారు.?