బాబుపై బిఆర్ఎస్ ఏడ్పులు మళ్ళీ మొదలు!

Harish Rao Comments on CBN

చంద్రబాబు నాయుడుపై జగన్‌కి ఎంత ద్వేషం, అసూయ, కక్ష ఉన్నాయో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కి కూడా అంతే ఉన్నాయి.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుని జైలుకి వెళ్ళకుండా ఆ బ్రహ్మ దేవుడు కూడా ఆపలేడని కేసీఆర్‌ అన్నారు. కానీ సాధ్యపడలేదు.

ADVERTISEMENT

కనుక 2019 ఎన్నికలలో జగన్‌కు తెర వెనుక నుంచి సాయపడి చంద్రబాబు నాయుడుని గద్దె దించేశారు. అందుకు చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే కేసీఆర్‌ కనీసం థాంక్స్ కూడా చెప్పలేదు.

బిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్‌… కనుక ఆయన విధానం ప్రకారమే ఆ పార్టీలో అందరూ చంద్రబాబు నాయుడుపై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తుంటారు.

తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ, సిఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు.

“చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు కేంద్రంలో మంచి పలుకుబడి ఉంది. కనుక ఇష్టారాజ్యంగా కృష్ణా, గోదావరి నీటిని తరలించుకుపోతున్నారు. ఆయనని అడ్డుకోవలసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇంజనీర్లు చేతులు ముడుచుకొని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసి ఉన్నా సిఎం రేవంత్ రెడ్డి పల్లెత్తుమాట అనకుండా నీటి దోపిడీకి చంద్రబాబు నాయుడుకి సహకరిస్తున్నారు.

నదీ జలాల బోర్డులు రెండూ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయా లేక చంద్రబాబు నాయుడు అధీనంలో పనిచేస్తున్నాయో అర్దం కానీ పరిస్థితి నెలకొంది. ఏపీ ప్రభుత్వం నీటి దోపిడీని తక్షణం అడ్డుకోకపోతే ఆయా ప్రాజెక్టుల కింద తెలంగాణ ఆయకట్టులో పంటలు నష్టపోతాయి,” అని అన్నారు.

ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కృష్ణా గోదావరి నదులు తెలంగాణ రాష్ట్రం గుండా పారుతాయి . కనుక కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగువనున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నీటి అవసరాలను పట్టించుకోకుండా కాళేశ్వరంతో సహా ఎక్కడికక్కడ అనేక ప్రాజెక్టులు నిర్మించి నీటిని తెలంగాణ జిల్లాలకు మళ్ళించుకున్నారు.

ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ నీటిని తాగు, సాగు అవసరాలకు నిలువచేసి ఉంచుకోవాలని ఏపీ ప్రభుత్వం ఎంతగా మొత్తుకుంటున్నప్పటికీ, ఆ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండేవారు. ఓ పక్క నీటిని తరలించుకుపోతూనే మళ్ళీ నీళ్ళలో వాటా కోసం ఏపీతో పేచీలు పెట్టుకునేవారు.

కానీ తెలంగాణకు దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోకి పారుతున్న నీటిని వాడుకుంటున్నా, అది నీటి దోపిడీయే అని హరీష్ రావు వాదిస్తున్నారు.

బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ తెలంగాణ సెంటిమెంటుతో రాజకీయాలు చేస్తుంటుంది. కనుక కేసీఆర్‌ నిన్న మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్‌ కాగానే తెలంగాణ సెంటిమెంటుతో రాజకీయాలు మొదలుపెట్టిన్నట్లున్నారు.

రేవంత్ రెడ్డిని దోషిగా నిలబెట్టి తెలంగాణ ప్రజలను బిఆర్ఎస్ పార్టీ వైపు తిప్పుకునేందుకే హరీష్ రావు ఈవిదంగా చంద్రబాబు నాయుడుని బూచిగా చూపిస్తూ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈవిషయం సిఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రులకు తెలుసు. కనుక హరీష్ రావుకి ఘాటుగా సమాధానం చెప్పకపోవచ్చు.

కానీ ఏపీ ప్రభుత్వం మౌనంగా ఉండిపోతే హరీష్ రావు ఆరోపణలు నిజమని ధృవీకరించిన్నట్లవుతుంది. కనుక బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ రగిలించే అవకాశం కల్పించకుండా ఏవిదంగా సమాధానం చెపుతారో?

ADVERTISEMENT
Latest Stories