
బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ‘తెలంగాణ సెంటిమెంట్’ని ఓ బలమైన ఆయుధంగానే వాడుకుంటుందని అందరికీ తెలిసిందే. ఓసారి చంద్రబాబు నాయుడు పేరుతో మరోసారి కృష్ణాగోదావరి నీళ్ళను ఏపీ ప్రభుత్వం దోచుకుపోతోందనే పేరుతో సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందుతూనే ఉంది.
తమ హయంలో తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో వర్ణించి చెప్పుకోవడానికి, జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ ఎంత దయనీయస్థితిలో ఉందో చూపిస్తూ మాట్లాడేవారు. అది నిజమే కనుక అప్పుడు ఆంధ్ర ప్రజలు ఎవరూ కాదనలేకపోయారు.
Also Read – మీరు ఎమ్మెల్యేలయ్యా… దొంగలుకారు!
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లేదా విమర్శించడానికి కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన చేస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
“బిఆర్ఎస్ హయంలో తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తుండేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు గుజరాత్, తమిళనాడు, చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఎందువల్ల? అంటే వారి నుంచి 20-30 శాతం కమీషన్స్ లేదా ఆ పేరుతో ఆర్‌ఆర్ ( రేవంత్ రెడ్డి)టాక్స్ వసూలు చేస్తుండటమేనా?” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Also Read – వైఎస్ అవసరం జగన్‌కే.. అందుకే ఈ హడావుడి?
ఇంత చిన్న ట్వీట్‌లో “చివరికి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రం కూడా” పెట్టుబడిదారులను ఆకర్షించగలుగుతోందని కేటీఆర్ వ్రాయడం గమనిస్తే, ఆయనకు ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత చులకన భావం ఉందో అర్దం చేసుకోవచ్చు.
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావలసిన పరిశ్రమలు, ఐటి కంపెనీలను హైదరాబాద్‌కు తరలించుకుపోతుంటే, ఏపీ ప్రజలు ‘మన బంగారం మంచిది కాకపోతే..’ అని బాధ పడ్డారు తప్ప కేటీఆర్‌ని, తెలంగాణ రాష్ట్రాన్ని నిందించలేదు.
Also Read – అప్పుడు డ్రగ్స్ కేసులు…ఇప్పుడు బెట్టింగ్ కేసులు..!
జగన్ అరాచక పాలన చూసి భయపడిన పారిశ్రామికవేత్తలు నేటికీ ఏపీకి వచ్చేందుకు భయపడుతుంటే, వారికి భరోసా ఇచ్చి రప్పించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కనుక కేటీఆర్ ఈ విషయం ప్రస్తావించి ఏపీకి పరిశ్రమలు సాధించుకుంటున్నారని ట్వీట్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఏపీ అంటే చాలా చులకనభావం ఉన్నందునే ‘ఏపీ వంటి రాష్ట్రం కూడా’ అంటూ ట్వీట్ చేశారనుకోవచ్చు.
అందుకే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినా కూడా ఆ పార్టీ నేతలకు అహంకారం తగ్గలేదని తరచూ విమర్శిస్తుంటారు.