Challa venkatramreddy

ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు…మేము మీ సేవకులం మాత్రమే అంటు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ప్రజల దగ్గర నుండి ఓటు అనే ఆయుధాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని దానిని నిర్వీర్యం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు.

నువ్వు నేర్పిన విధ్యేగా నీరజాక్షా…! అంటు నువ్వు మొదలుపెట్టావు కాబట్టే నేను కొనసాగిస్తున్నా అంటు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ రాజకీయ కండువాల మార్పు అనే విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. పలానా రాజకీయ నాయకుడు అస్సలు అవినీతికి పాల్పడడు అంటే అతనిని ఆదర్శంగా తీసుకుని అతని బాటలో అడుగులు వేయడానికి ఎవరు ముందుకు రారు.

Also Read – చంద్రబాబు ప్రభుత్వంలో వైసీపి కోవర్టులు… ఏరేదెప్పుడు?

అది వాడి చేతకాని తనం, వాడి పిరికితనం అంటు అవహేళన చేసి తమ దందా తాము కొనసాగిస్తారు. అదే ఒకడు మన పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యే లను లాక్కున్నాడు అంటే మాత్రం వాడు చేస్తే తప్పులేదు కానీ నేను చేస్తే తప్పా? అంటు ఎదురు ప్రశ్న వేసి మరి పక్క పార్టీ నుండి 8 మంది ఎమ్మెల్యే లను లాక్కుంటున్నారు.

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయం ఇదే. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతిపక్షమనేదే లేకుండా చెయ్యడానికి అన్ని పార్టీల నుండి నాయకులని గంపగుత్తగా లాగేసుకుంది. ఇప్పుడు కేసీఆర్ కు అధికారం పోయింది. ఈ కండువాలట రేవంత్ కొనసాగిస్తున్నాడు.

Also Read – జగన్ ‘బలం’…బాబేనా..?

కేసీఆర్ వేసిన విష భీజానికి ఇప్పుడు రేవంత్ నీళ్లు పోసి పెంచుతున్నారు. బిఆర్ఎస్ ఓటమి తరువాత ఒక్కో గులాబీ కండువాను కాంగ్రెస్ కండువాగా మార్చేస్తున్నారు రేవంత్. ఇప్పటికే దాదాపుగా బిఆర్ఎస్ కారు కాళీ అయిపోయింది. ఇక అడుగుబొడుగు నాయకులను కూడా వదిలేది లేదు అనేలా రేవంత్ బిఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ అభయ హస్తాన్ని అందిస్తూనే ఉన్నారు.

ఇప్పటీకే 7 గురు బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు, 8 మంది ఎమ్మెల్సీ లు కేసీఆర్ ను కాదని రేవంత్ కు జై కొట్టారు. నేడు తాజాగా మరో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గులాబీ బాస్ కు హ్యాండ్ ఇచ్చి రేవంత్ పంచన చేరారు. ఇలా ఎవరి ఇష్టానికి వారు పార్టీలు మారిపోవడం , పార్టీ అధినేతలు కూడా దగ్గరుండి కండువాల మార్పును ప్రోత్సహిస్తే ఇక ప్రజా తీర్పుకు విలువెక్కడా.? ఎన్నికల ప్రక్రియకు గౌరవమెక్కడ.?

Also Read – జగన్‌ చేయాల్సిన ధర్నాలు చాలానే ఉన్నాయి

ఇది ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. అటు ఏపీ ఇటు తమినాడు అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. ప్రజలు మాకొద్దీ నాయకుడు అని తిరస్కరించిన తరువాత కూడా ఆ నాయకుడిని అధికార పార్టీ ఎలా తీసుకుంటుంది.? లేదా ఈ పార్టీ మాకు నచ్చలేదు అని ప్రజలు తీర్పిస్తే అదే పార్టీ నాయకులను తీసుకుని అధికార పార్టీ ఎందుకు నెత్తిన పెట్టుకుంటుంది.?

ఇక్కడ అవినీతి పరుడు పార్టీ మారగానే అక్కడ శచ్చిలుడవుతాడా.? వారు మొదలు పెట్టారు..వీరు మొదలు పెట్టారు అంటు అందరు అదే ధోరణిని కొనసాగిస్తే పిల్లి మేడలో గంట కట్టేదెవరు.? ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రజా తీర్పును గౌరవించడమంటే ఓడిపోయాడు అంటే ఓడిపోయాడనే అర్ధం. వారిని గెలిపించడానికి గెలిపించిన పార్టీలోకి తీసుకు రావడానికి ఎవ్వరికి అర్హత లేకుండా బలమైన చట్టాలు తీసుకురావాలి.

అప్పుడే ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వెయ్యగలం. లేకపోతే ఎన్నో రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఆడే రాజకీయ చదరంగంలో పావులుగా మిగిలిపోతాయి. ఎన్నికల కాలగర్భములో కలిసిపోయి తమ అస్తిత్వవాన్ని కోల్పోతాయి. రాజకీయాలలో మార్పు రావాల్సిన సమయం వచ్చింది. ప్రజలు మారుతున్నారు రాజకీయ నాయకులు కూడా మారాలి.