దిల్ రాజు బ్యానర్ అంటే ‘నో’ అనగలరా?!

Buzz Dil Raju to introduce Jhanvi Kapoor in telugu‘అతిలోకసుందరి’ శ్రీదేవికి టాలీవుడ్ తో ఉన్న అనుబంధం తెలియనిది కాదు. చిన్ననాటి నుండి తెలుగు సినిమాలు చేస్తూ ఎదిగిన శ్రీదేవి తనయురాలు జాన్వీ, గత వారం “దడక్” సినిమా ద్వారా బాలీవుడ్ రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తొలి చిత్రం ద్వారా యావరేజ్ మార్కులు సంపాదించుకున్న జాన్వీని తెలుగులో పరిచయం చేసేందుకు నిర్మాతలు ఆసక్తి కనపరుస్తున్నారట.

ADVERTISEMENT

అందులో ముఖ్యంగా దిల్ రాజు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే బోనీ కపూర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ట్రేడ్ టాక్. ఓ భారీ ప్రాజెక్ట్ ద్వారా లాంచ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఫైనల్ గా బోనీ నుండి గ్రీన్ సిగ్నల్ లభించడమే తరువాయి అన్న టాక్ బలంగా వినపడుతోంది. సక్సెస్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న దిల్ రాజు బ్యానర్ అంటే బోనీ కూడా ‘నో’ అనగలరా?!

ADVERTISEMENT
Latest Stories