ఒక కుటుంబంలో తల్లికో, చెల్లికో, తండ్రికో ఆపదొస్తే మనం ఏం చేస్తాం ప్రాణం అడ్డమేసి పోరాడి నిలబడతాం. అలాగే మన కుటుంబంలో ఆడవారి పై తప్పుడు మాటలు మాట్లాడిన వారిని ఏం చేస్తాం కుదిరితే నిలువునా నరుకుతాం అంటూ బైరెడ్డి చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీనే ఇరుకున పెట్టేలా ఉన్నాయి. ఇంట్లో ఆడవారి జోలికి వెళ్లిన వారిని విడిచి పెట్టకూడదు అంటూ చెప్పే నీతులు మీ పార్టీ నేతలకు వర్తించవా బైరెడ్డి అంటూ జగన్ మొదలు వైసీపీ నేతలు ప్రతిపక్ష నేతల ఆడవారి పై చేసిన దిగజారుడు విమర్శలను గుర్తుచేస్తున్నారు.
గతంలో లోకేష్, చంద్రబాబు తన తల్లి ని దూషించారు అంటూ ప్రచారం చేసిన పవన్ ఇప్పుడు అదే బాబు పంచన చేరారు. ఇలా తన తల్లిని తిట్టినా వారితో దోస్తీ నా.? మన ఇంట్లో పెంచుకునే కుక్క చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ రోడ్డు మీదకు వెళ్తే ఊరకుక్క కరిచి చంపేస్తది. అలాగే వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడే పవన్ ను గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్న 5 వతరగతి పిల్లాడు కూడా కొడతాడు. అది పవన్ రేంజ్ అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి బై రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన వారు, తిట్టించిన వారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఏ నాయకుడికి మద్దతుగా నిలబడ్డారో బైరెడ్డి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇటువంటి నీతి ప్రవచనాలు, రెచ్చగొట్టే తరహా వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదేమో అంటున్నారు పవన్ అభిమానులు. కొట్టడాలు, నరకడాలు, మనుషులను చంపి డోర్ డెలివరీలు చేయడంలో వైకాపా నాయకులకు ఉన్నంత ప్రావిణ్యం మారేపార్టీ నేతలకు లేదనేది బైరెడ్డి తెలుసుకోవాలంటూ జనసైనికులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
నిండు సభలో ప్రతిపక్ష నాయకుడి భార్యను అవమానించిన వైసీపీ నేతలను టీడీపీ కుటుంబసభ్యులు ఏంచెయ్యాలో బైరెడ్డి సమాధానం చెప్పాలి? అలాగే పిల్లల సభలో కూడా పవన్ మూడు పెళ్లిళ్లు, పెళ్ళాలు, పిల్లలు అంటూ రాజకీయాలకు సంబంధం లేని ఆడవారిని బజారుకు లాగే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జనసేన కుటుంబం ఏం బదులివ్వాలి? జగన్ కు రాజకీయంగా ఎదురునిలిచిన సొంత సోదరులు వైస్ సునీతా రెడ్డి, వైస్ షర్మిల పై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దిగజారుడు విమర్శల పై ఎవరిని నిందించాలి? ఎవరిని నిలువునా..? దీనికి సమాధానం చెప్పాలి బైరెడ్డి అంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
పవన్ ను 5 వ తరగతి పిల్లాడు కూడా కొట్టగలడు అంటూ భవిష్యత్ తరానికి కూడా హింసా ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్న ఇటువంటి నాయకులను తమ ఓటు హక్కు తోనే రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి అంటూ జనసైనికులు ఏపీ ప్రజలకు పిలుపునిస్తున్నారు.




