రేవంత్ ను మరో కేసులో ఇరికిస్తున్న కేటీఆర్!

Case on Revanth Reddy తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పద్మవ్యూహం పన్ని అందులో రేవంత్ రెడ్డి ని ఇరికించిన విషయం అందరికి తెలిసిందే. ఓటుకు నోటు కేసులో ఇప్పటికి రేవంత్ ఇరుకునే ఉన్నారు. ఈ కేసు ఆయన రాజకీయ భవిష్యత్తుకు పెద్ద గుదిబండ అనడంలో ఏ మాత్రం తప్పు కాదు. మరో వైపు కేటీఆర్ రేవంత్ ను మరో కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డికి కేటీఆర్ బందువు ఒకరు లీగల్ నోటీసు పంపించారు. హైదరాబాద్ లో జరుగుతున్న సన్ బర్న్ ఈవెంట్ తో కేటీఆర్ బంధువు రాజేంద్ర ప్రసాద్ కు సంబందం ఉందని రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. దీనిపై ఆయన ఈ లీగల్ నోటీసు ఇచ్చారు.

ADVERTISEMENT

తనకు సన్న బర్న్ కార్యక్రమంతో ఎలాంటి సంబందం లేదని, రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.తన ప్రతిష్ట దెబ్బతినేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినందున క్షమాపణ కోరుతూ ఆయన లీగల్ నోటీసు పంపించారు. గడువులోగా క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డి పై లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం అని స్పష్టం చేసారు.

ADVERTISEMENT
Latest Stories