పువ్వుల నుంచి తేనె దొంగతనం చేసి తేనెటీగలు గూడు కట్టుకున్నట్లుగా, వైసీపీలో దాదాపు ప్రతీ ఒక్కరూ ఏదో అవినీతి, అక్రమాలు, కబ్జాలకు పాల్పడి సంపద పోగేసుకున్నారు.
ఓ మంత్రిగారి గోదాములో తెల్ల రేషన్ కార్డులు బియ్యం మాయం అయిపోతే, మరో మంత్రిగారు ఇలాకాలో అటవీ భూములు మాయం అయిపోతాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఇటువంటి ఘనమైన చరిత్ర కలిగిన ఆ మాజీ మంత్రులలో విడదల రజనీ కూడా ఒకరు. ఆమె 2020లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పల్నాడు జిల్లా యడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారు.
ఆ కలెక్షన్స్, వాటిలో వాటాల పంపకాల గురించి ఇప్పటికే పత్రికలో వివరాలు వచ్చాయి కనుక ఇప్పుడు ఆ చర్చ అనవసరం.
వైసీపీలో ఎప్పటికప్పుడు బయటపడుతున్న ఈ భాగోతాలు చూస్తున్నప్పుడు, ఒకవేళ వైసీపీ మరో 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఉంటే ఏమయ్యేది? మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఏమిటి? సరే! వైసీపీలో అవినీతిపరులను కూటమి ప్రభుత్వం పట్టుకొని ఏం చేయగలుగుతోంది? అనే సందేహాలు కలుగుతాయి.
ఇప్పటికే జోగి రమేష్, పోసాని, వంశీలతో సహా ఓ అరడజను మందిపై కేసులు వేసింది. కొందరు లోపలకు వెళ్ళి బయటకు వస్తున్నారు.
కనుక ఈ పల్నాడు అవినీతి క్రషర్ ఎపిసోడ్ నోటీసుతో మొదలేయి విచారణ, ముందస్తు బెయిల్ పీటిషన్, అరెస్టు, బెయిల్‌పై విడుదలతో పూర్తవుతుంది.
పోనీ.. ఈ కేసులతో వైసీపీ నేతలెవరైనా భయపడుతున్నారా?కనీసం భయపెట్టగలిగిందా?అంటే వైసీపీ నేహాలు ‘తగ్గేదేలే’ అంటున్నారుగా?
పోనీ.. వైసీపీ నేతల చేతుల్లో వేధింపులకు గురైన టీడీపీ కార్యకర్తలనైనా ఈ కేసులతో సంతోషపెట్టగలిగిందా?అంటే లేదని వారే చెపుతున్నారుగా?
కనుక కొండను తవ్వి ఎలుకని కూడా పట్టుకోలేకపోతున్నప్పుడు, ‘మనం ఏవిదంగా ముందుకు సాగుతున్నామని’ ఆలోచించుకోవలసింది కూటమి ప్రభుత్వమే.. కేసులతో సానుభూతి పొందుతున్న వైసీపీ కాదు.




