ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వర రావు మళ్ళీ ఒక్కటవడం బహుశః వైసీపీ అధినేత జగన్ జీర్ణించుకోవడం కష్టమే. చంద్రబాబు నాయుడి ప్రతీ శత్రువుని జగన్ మిత్రుడుగానే భావిస్తుంటారు.
లక్ష్మీ పార్వతి, పోసాని, వర్మ వంటివారిని అందుకే చేరదీశారు. చంద్రబాబు నాయుడుతో విభేదించి బయటకు వచ్చి ఆయనని విమర్శిస్తున్నందునే దగ్గుబాటిని కూడా వైసీపీలో చేర్చుకొని 2019 ఎన్నికలలో పర్చూరు టికెట్ కూడా ఇచ్చారు. కనుక ఇప్పుడు ఆయన తనని కాదని చంద్రబాబు నాయుడుని కౌగలించుకుంటే జగన్ జీర్ణించుకోగలరా?
ఒకప్పుడు వారిద్దరూ టీడీపీలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుతో విభేదించి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్నిసార్లు విమర్శించారు. ఆయన వ్రాసిన ‘ఒక చరిత్ర-కొన్ని నిజాలు’ పుస్తకంలో కూడా చంద్రబాబు నాయుడుని విమర్శించారు.
నాడు లిఖిత పూర్వకంగా చంద్రబాబు నాయుడుని విమర్శించిన దగ్గుబాటి వేంకటేశ్వర రావు, ఇప్పుడు తాను రచించిన ‘ది గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సిఎం చంద్రబాబు నాయుడుని ముఖ్య అతిధిగా రావాలని స్వయంగా ఉండవల్లికి వెళ్ళి ఆహ్వానించారు.
సిఎం చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించి నేడు విశాఖలో జరిగిన పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిధిగా వచ్చారు.
వేలాదిమంది సమక్షంలో వేదికపై ఆయనను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. ఇటువంటి గొప్ప పుస్తకం వ్రాసినందుకు మనసారా అభినందించారు.
దగ్గుబాటి వేంకటేశ్వర రావు కూడా సానుకూలంగా స్పందిస్తూ, “ఒకప్పుడు విభేధాలతో దూరమైన మాట వాస్తవం. కానీ ఎల్లప్పటికీ వాటినే తలుచుకుంటూ అలాగే ఉండిపోనవసరం లేదు. కాలంతో పాటు మనమూ మారాలి,” అని అన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపిలు పొత్తులు పెట్టుకుంటే జగన్, వైసీపీ నేతలు, వారి సొంత మీడియా దగ్గుబాటి పురందేశ్వరిపై పడి ఏడ్చారు. ఆమెను నానా మాటలన్నారు.
ఇప్పుడు తోడల్లుళ్ళు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వేంకటేశ్వర రావులు కూడా చేతులు కలిపితే జగన్ భరించగలరా? వీరిరువురి బంధంతో మళ్ళీ ఎన్టీఆర్ కుటుంబం ఏకం అవుతుంది. అది చూసి జగన్ తట్టుకోగలరా? లక్ష్మీ పార్వతి తట్టుకోగలరా?
దగ్గుబాటి వేంకటేశ్వర రావు, సిఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ చేతులు కలపడం వలన అనూహ్యమైన రాజకీయ పరిణామాలు ఏవీ జరిగిపోవు. కానీ జగన్ తల్లిని, చెల్లిని, విజయసాయి రెడ్డి వంటి నమ్మకస్తుడిని కూడా దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోతే, చంద్రబాబు నాయుడుని ద్వేషించినవారు కూడా ఆయనకు దగ్గరవుతున్నారు. కనుక జగన్‌కి ఇది పైకి చెప్పుకోలేని పైల్స్ వంటి బాధే.
దాదాపుగా రెండు దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు
తోడల్లుడు చంద్రబాబు నాయుడు తో సంధి… రెండు కుటుంబాల కలయిక#ChandrababuNaidu pic.twitter.com/pgReKK53NG
— M9 NEWS (@M9News_) March 6, 2025




