చంద్రబాబు పై వైసీపీ ప్రభుత్వం మోపిన కేసుల విచారణ చివరి అంకానికి చేరుకున్నట్టేనా? అనే ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరికే అవకాశం ఉండవచ్చు అనుకున్న వాళ్లకు న్యాయస్థానం ఉగాది పచ్చడిని రుచి చూపించింది. న్యాయస్థానాలు రిజర్వ్ లో ఉంచిన తీర్పులను వెలువరించడం, విచారణలో ఉన్న కేసులకు తుది తీర్పు ప్రకటించడం చేయవచ్చని టీడీపీ శ్రేణులు వేయి కళ్ళతో ఎదురుచుస్తూనే వచ్చారు.
చంద్రబాబు కు పట్టిన జగన్ అనే గ్రహణం ఈనాటితో తొలగిపోతుందనే ఆశతో టీడీపీ వర్గాలు, బాబుని వదిలేదెలే – బెయిలు వచ్చేదేలే అనే ఆశతో వైసీపీ వర్గాలు ఇలా రెండు రెండు పార్టీల శ్రేణులు ఆశా – నిరాశల మధ్య ఉగిసలాడుతున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అంగడ్లు అంటూ పలు రకాల కేసులలో బాబుని దోషిగా పేర్కొంటూ వైసీపీ ప్రభుత్వం అనుసరించిన నిరంకుశత్వం ధోరణికి., వాయిదాలు , బదిలీలు, తీర్పు రిజర్వులు అంటూ న్యాయస్థానాల వైఖరితో నిస్తేజంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకి నేటితో ఈకేసుల నుండి మోక్షం కలిగేనా?అన్న ప్రశ్నకు ఈరోజు కొంత వరకు తెరపడిందనే చెప్పాలి.
బాబు కేసు తాలూకా విచారణ చివరి దశకు చేరే సమయంలో జగన్ ఢిల్లీ టూర్ సర్వత్రా చర్చ నీయాంశం అయ్యింది. ఇది అటు టీడీపీ శ్రేణులలో కొంత టెంక్షన్ వాతావరణాన్ని సృష్టిస్తుంది.అయినా తమ అధినేత పై ఉన్న భరోసా, న్యాయస్థానాల మీద ఉన్న నమ్మకంతో బాబు నిర్దిషిగా ప్రజాక్షేత్రంలోకి వస్తారనే ఆశతో ఉన్న తెలుగు తమ్ముళ్ల ఎదురుచూపులకు న్యాయస్థానాలు నిరాశనే మిగిల్చాయి.
ఆయా కేసులలో ముందస్తు బెయిలుకు అనుమతి ఇవ్వాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం టీడీపీ నేతలలో నిరాశే చోటుచేసుకుంది. అలాగే చంద్రబాబు ని కస్టడీకి ఇవ్వాలని సిఐడి వేసిన పిటిషన్ కూడా కోర్ట్ డిస్మిస్ చేయడంతో కొంత ఉరటా కలిగింది.సుప్రీం కోర్టులో వేసిన బాబు స్కిల్ డెవలప్మెంట్ క్వాష్ పిటిషన్ విచారణ జరిపిన ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు రేపటికి కొనసాగించాలంటూ కేసుని వాయిదాతో ముగించింది.
ఇలా చంద్రబాబు కేసులు ఒక ఊరట, ఒక వాయిదా, ఒక క్యాన్సిల్ ప్రకటనలతో టీడీపీ శ్రేణులను గెలుపోటముల మధ్య బందిఖానా చేస్తున్నాయి న్యాయస్థానాలు. చూడాలి మరి రేపటికైనా టీడీపీ నేతల సందిగ్దత కు ఒక పరిష్కారం దొరుకుతుందో లేదో!



