పోలవరంకు ఇస్తామన్న 1000 కోట్లు హుష్ కాకి!

Center Tries to Stop Polavaram project Financesపోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి 1400 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మర్చి నెలలో అనుమతిచ్చింది. అయితే కేంద్రం మరో షాకిచ్చింది… రెండు రోజుల్లోనే వెనక్కు తగ్గింది.. మార్చ్ 22 వ తేదిన, పోలవరానికి రూ.311 కోట్లు కోత పెట్టింది. రూ.1400 కోట్లు ఇవ్వము అంటూ, 1089 కోట్లు మాత్రమే ఇవ్వాలని జలవనరులశాఖ ఆదేశించింది.

ADVERTISEMENT

ఇప్పటిదాకా ఆ 1089 కోట్లలో రూపాయి అంటే, రూపాయి ఇప్పటి వరకు ఇవ్వలేదు.. ఆర్ధిక సంవత్సరం చివరిలో డబ్బులు ఇవ్వటం కుదరలేదు అని అన్నారు అప్పట్లో. ఈ లోపు, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎదో ఆపరేషన్ చెయ్యటంతో, ఆయన అందుబాటులో లేరని, ఆర్దిక సంవత్సరం మారిపోయింది కాబట్టి, ఆయన అప్రూవల్ కావాలని ఆర్ధిక శాఖ అధికారులని మరో అడ్డుపుల్ల వేశారు.

అయితే ఎన్డీయే నుండి బయటకు వచ్చినందుకుగానూ టీడీపీ ప్రభుత్వంపైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్షసాధింపు చర్య అని తెలుస్తూనే ఉంది. దీనిని ముందే ఊహించిన రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ప్రాజెక్ట్ పనులు ముందుకు నడిపిస్తుంది. 2019 మార్చి నాటికి ఎలాగైనా గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.

ADVERTISEMENT
Latest Stories